SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ వారంలోనే మళ్లీ ‘ఢీ’ లిమిటేషన్ బిల్లు.. ఉభయ సభల్లో మోడీ- షా ప్లాన్ ఏంటి..?

Delimitation Bill: దేశ రాజధాని హస్తినలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై నరేంద్ర మోడీ సర్కార్ మళ్లీ ఫోకస్ చేసింది. ఈ వారంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏప్రిల్‌లో కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ సభల వీగిపోయింది. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకుంది. ఈసారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ సాధించాలనే పట్టుదలతో మోడీ టీం ఉంది. ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలు,విపక్ష కూటమిలోని చీలికలు ప్రభుత్వానికి కొత్త బలాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ఈ ప్రత్యేక సమావేశాల వ్యూహం ఏంటి? బిల్లును గట్టెక్కించేందుకు మోడీ-షా దగ్గరున్న అసలు ప్లాన్ ఏమిటి?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 05:59 AM IST | Updated: Oct 25, 2026, 06:00 AM IST
Image Credit: Modi - Shah Plan on delimitation bill (File/Source)
Join

Parliament Special Session on delimitation Bill:దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టింది. లోక్‌సభలో గత ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి  సర్కార్‌ పావులు కదుపుతోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ బిల్లు, వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లులను ఆమోదించుకోవాలని మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ వారంలోనే లేకపోతే దీపావళి లోపు  పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది.

5 రాష్ట్రాల  ఎన్నికల తర్వాత మారిన రాజకీయ ముఖ చిత్రం..

రెండు బిల్లుల ఆమోదానికి గత ఏప్రిల్ లోనే ప్రయత్నించినా కావాల్సిన మెజార్టీని మోడీ సర్కార్ సాధించలేకపోయింది. అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌  15 యేళ్ల  పాలనకు గండికొట్టి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఘోర పరాజయం చవిచూసిన టీఎంసీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయగా, మరో 20 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు అధికార పక్షంలో చేరారు. మహారాష్ట్రలోని శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమికి జై కొట్టారు.

టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడంతో రాహుల్ పై స్టాలిన్ గుస్సా..

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దిగిపోయింది. అదే సమయంలో టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడంతో రాహుల్ గాంధీపై స్టాలిన్ గుర్రుగా ఉన్నారు. ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చారు. దీంతో ఎన్డీఏ సర్కార్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌-డీఎంకే కూటమి విచ్ఛిన్నమవ్వడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్టు సమాచారం. 8 మంది ఎంపీల బలమున్న ఎన్సీపీ శరద్ పవార్ టీంతో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.

డీలిమిటేషన్‌కు పలు రాజ్యాంగ సవరణలు..

డీలిమిటేషన్‌ జరగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది.

రాజ్యసభలో బిల్లు ఆమోదానికి 163 ఎంపీల సపోర్ట్ అవసరం..
రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. కానీ అధికార ఎన్డీయేకి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి  మంది  319 సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమి నుండి బయటకు వచ్చిన డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉండగా.. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి 8 మంది ఎంపీలున్నారు. ఆ రెండు పార్టీల సపోర్ట్ లభిస్తే బిల్లుల ఆమోదానికి లైన్ క్లియర్ కానుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES