SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

Public Holiday: ఛత్ పూజ సందర్భంగా ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్. ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 16వ తేదీన సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది.

Written By Bhoomi
Published: Nov 11, 2026, 11:43 AM IST | Updated: Nov 11, 2026, 11:45 AM IST
Image Credit: Public Holiday:
Join

Public Holiday: ఛత్ పూజ సందర్భంగా ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్. ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 16వ తేదీన సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రసిద్ధ పండగ అయిన ఛత్ పూజ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఈ సెలవును ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఛత్ పూజ జరుపుకునే వేలాది మంది భక్తులకు పండగ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. రాజధాని పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది.

ఛత్ పూజ ఉత్తర భారతదేశంలోని ప్రధాన పండుగలలో ఒకటి. ఢిల్లీలో కూడా చాలా మంది ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో, ఉపవాసం ఉన్న స్త్రీ, పురుషులు సూర్య భగవానుడిని, ఛఠీ మైయాను పూజిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో నహే-ఖాయ్, ఖర్నా, సంధ్యా అర్ఘ్యం,  ఉషా అర్ఘ్యం వంటి ప్రత్యేక ఆచారాలు ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో.. నవంబర్ 16వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం ప్రభుత్వ ఉద్యోగులకు, ఛత్ పండుగ జరుపుకునే వారికి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ సెలవును ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ప్రకటించారు.

Also Read: 

 

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

 

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES