SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!

సంక్రాంతికి సోంతూరుకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే రైలు ప్రయాణం చేసేవారికి బిగ్‌ అలెర్ట్‌. ఎల్లుండి నవంబర్‌ 14 నుంచే రైలు రిజర్వేషన్‌ ప్రారంభం అవుతుంది. ఆలస్యం అయితే, టిక్కెట్‌లు దొరక్కపోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 12, 2026, 10:09 AM IST | Updated: Nov 12, 2026, 10:11 AM IST
Image Credit: IRCTC Sankranti Booking:
Join

IRCTC Sankranti Booking: సాధారణంగా రైలు ప్రయాణం ఎంతో సులభం. సుదీర్ఘ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. సంక్రాంతికి చాలామంది రైలు ద్వారా సొంతూళ్లకు వెళ్లారు. మరికొందరు బస్సు, ఫ్లైట్‌ ఇతర సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తారు. ఈ సంక్రాంతి సమయంలో భారీ డిమాండ్‌ ఉంటుంది కాబట్టి బస్సు, ఫ్లైట్‌ ధరలు అయితే ఆకాశన్నంటుతాయి. ఇతర ప్రైవేటు వాహనాలు వారు కూడా బాగా డబ్బులు దండుకుంటారు. మీరు సంక్రాంతికి సొంతూరుకు రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ముందుగానే ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకోండి.

సాధారణంగా భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తే 60 రోజులు ముందుగానే రిజర్వేషన్‌ తప్పనిసరి. ఇది కాకుండా ఒకరోజు ముందు తత్కాల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. భారీ రద్దీ దృష్ట్యా సంక్రాంతికి ఊరెళితే ఎల్లుండి నవంబర్‌ 14వ తేదీనా మీరు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఈరోజు నుంచి రిజర్వేషన్‌లు ప్రారంభం అవ్వనున్నాయి. జనవరి 14వ తేదీ భోగి ఉంది. ఇక పండుగకు రెండు మూడు రోజులు ముందు వెళ్లేవారు కూడా ఈరోజు లేదా రేపు బుక్‌ చేసుకోవచ్చు.

Read Also: Video: వందే భారత్ స్లీపర్‌లో టికెట్ ప్రింట్ తీసుకెళ్లకపోతే ఫైన్ పడుతుందా? రూల్స్‌ ఇవే..!!
Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!

అయితే, సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పండుగ సమయంలో సగం హైదరాబాద్‌ ఖాళీ అవుతుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు కూడా ఈ పండక్కి తప్పకుండా సొంతూరుకు వెళ్లారు. సంక్రాంతి పండుగ అనేది ఏపీవారికి అయితే ఒక పెద్ద పండుగ.  పంట చేతికి వచ్చే సమయం. రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, కోళ్ల పందాలు, ఇంటికి వచ్చే బంధువులతో కిటకిటలాడుతుంది. అందుకే ఎక్కడున్న ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లారు. సంక్రాంతి పండుగ ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడులో కూడా జరుపుకొంటారు.

భారతీయ రైల్వే కొన్ని పండుగలకు అనుగుణంగా, రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. దీనికి ముందే మీరు రిజర్వేషన్‌ చేసుకుంటే ప్రస్తుతం ఉండే రైళ్ల సీట్‌ రిజర్వేషన్‌ అవుతుంది. భారతీయ రైల్వేలో జనరల్‌, స్లీపర్, 3 ఏసీ, 2 ఏసీ, ఫస్ట్‌ ఏసీ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక వేళ మీరు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోకపోతే, ఒక రోజు ముందు తత్కాల్‌ టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఏసీ ప్రయాణానికి, 11 గంటలకు నాన్‌ ఏసీ ప్రయాణానికి బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయి. అయితే, ఇక్కడ కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో టిక్కెట్‌ బుక్‌ కాకపోతే ఇబ్బంది

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES