• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Durga Pandal Stampede: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృతి

Durga Pandal Stampede: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృతి

Stampede In Durga Pandal 17 People Dead And 25 Injured: దసరాను పురస్కరించుకుని దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతుండగా.. ఒక్కసారిగా తీవ్ర విషాదం నింపింది. ఓ దుర్గా మండపంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుని 17 మంది మృతి చెందగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 12:08 AM IST|Updated: Oct 18, 2026, 12:16 AM IST
joinshare
Durga Pandal Stampede: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృతి
Image Credit: Durga Pandal Stampede

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

2

Durga Pandal Stampede: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృతి

3

Dandiya Event Tragedy: దాండియా ఉత్సవాల్లో కూలిన లైటింగ్.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు

4

Noida Noodles Tragedy: నూడుల్స్ తిని ఐదుగురి మృతి.. నోయిడా ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు.!.

5

Dussehra 2026: దసరా వేళ శుక్రమూఢమి..?.. ఆయుధపూజ, శమీచెట్టు ఆరాధనపై పండితులు ఏంచెబుతున్నారంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chorbagan Sarbojanin Durga Puja Pandal: దేవీ నవరాత్రి ఉత్సవాలకు పశ్చిమ బెంగాల్‌ ప్రసిద్ధి చెందినది. దుర్గామాతను అత్యధికంగా పూజించే బెంగాల్‌ రాష్ట్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తీవ్ర విషాదం నింపాయి. దుర్గమాతకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన కొందరు మరణించారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ర్ట రాజధాని కోలకత్తాలో చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉత్తర ప్రాంతంలోని చోర్ బగాన్ సర్వజనీన్ దుర్గామాత మండపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకే ఒక ఎగ్జిట్‌ (బయటకు వెళ్లేందుకు మార్గం) ఉండడంతో మండపానికి వచ్చిన భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరుకైన మార్గం కావడంతో ఆ తోపులాటలో పెద్ద సంఖ్యలో భక్తులు కిందపడిపోయారు. ప్రాణ భయంతో అందరూ అలా తొక్కుకుంటూ పోవడంతో కిందపడిన వారు పైకి లేవలేక అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్షతగాత్రులను స‌మీపంలోని కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ప్రమాదానికి కారణం?
చోర్‌ బగాన్‌ సర్వజనీన్‌ దుర్గామాత మండపం సమీపంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీనికి ఈదురుగాలులు వీచాయి. వర్షం ప్రారంభమవడంతో మండపం బయట నిలిచి ఉన్న భక్తులు ఒక్కసారిగా లోపలకు తోసుకుంటూ వచ్చేశారు. ఇక వర్షం కారణంగా బయటకు వెళ్లేవారు మండపంలోనే ఉండడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుందని సహాయ చర్యల్లో పాల్గొన్న ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఆ తోపులాటలో ఊపిరాడక భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
దుర్గా మండపంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పెద్ద ఎత్తున భక్తులు మృతి చెందడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాతోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కొన్ని నిమిషాల్లోనే సీఎం స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి సువేందు ఆదేశించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News
National News
Trending News