• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

IND vs WI 5th T20I Washed Out And 5 Matches Series Equal With 2 2: వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుని ఫుల్‌ జోష్‌ టీ20 సిరీస్‌కు బరిలో దిగగా భారత్‌కు ఎదురుదెబ్బ తగలగా.. నిర్ణయాత్మక ఆఖరు మ్యాచ్‌ వర్షానికి రద్దయ్యింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌, వెస్టిండీస్‌ జట్లు 2-2తో సమం చేసుకున్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 12:59 AM IST|Updated: Oct 18, 2026, 01:03 AM IST
joinshare
India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం
Image Credit: India vs West Indies

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

India vs West Indies: భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వర్షార్పణం.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం

2

Durga Pandal Stampede: దుర్గా మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృతి

3

Dandiya Event Tragedy: దాండియా ఉత్సవాల్లో కూలిన లైటింగ్.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు

4

Noida Noodles Tragedy: నూడుల్స్ తిని ఐదుగురి మృతి.. నోయిడా ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు.!.

5

Dussehra 2026: దసరా వేళ శుక్రమూఢమి..?.. ఆయుధపూజ, శమీచెట్టు ఆరాధనపై పండితులు ఏంచెబుతున్నారంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND vs WI 5th T20I Washed Out: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ను కోల్పోగా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సమం చేసుకుంది. వరుణుడు ఆటంకం కలిగించడంతో నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20 మ్యాచ్‌ రద్దయ్యింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు చేశారు. టాస్‌ ఓడి ఐదు ఓవర్లు భారత జట్టు ఆడిన తర్వాత మళ్లీ వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో ఇక చేసేది లేక మ్యాచ్‌ను రద్దు చేస్తూ రిఫరీలు నిర్ణయం ప్రకటించారు.

బెంగళూరులో శనివారం సాయంత్రం వర్షం పడుతోంది. కొంత విరామం ఇచ్చి పడుతూనే ఉండడంతో చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఆలస్యంగా వేయాల్సి వచ్చింది. మ్యాచ్‌ ఎలాగైనా కొనసాగించాలని ప్రయత్నాలు చేసినా వరుణుడు తగ్గేలే అనడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా మొదట మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. టాస్‌ వెస్టిండీస్‌ జట్టు గెలవగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది.

బ్యాటింగ్‌కు దిగిన భారత్ 7.4 ఓవర్లలో 118/5 స్కోరు చేయగా.. మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకీ వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో ఆటను ముగించారు. బ్యాటింగ్‌లో భారత్‌ తరఫున ఇషాన్ కిషన్ దూకుడు ఆడి 30 పరుగులు చేశాడు. 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది రాణించగా.. నమన్ ధిర్ (24), శ్రేయస్ అయ్యర్ (22), సంజు శాంసన్ (16), తిలక్ వర్మ (7), అభిషేక్ శర్మ (6) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మరోసారి విండీస్ బౌలర్లు ప్రతాపం చూపించారు. గత మ్యాచ్‌ హీరో కీమో పాల్ ఐదో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయగా.. షమార్ జోసెఫ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. మళ్లీ వర్షం ప్రారంభమవడంతో ఇక మ్యాచ్‌ను ఏమాత్రం కొనసాగించే అవకాశం లేకపోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ 2-2తో సమమైంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా విండీస్ కెప్టెన్ షై హోప్ నిలిచాడు. టైటిల్‌ను ఇరు జట్ల కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్‌, శాయి హోప్ అందుకున్నారు.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌ను అనూహ్యంగా వెస్టిండీస్‌ విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో భారత్‌ నెగ్గగా.. ఊహించని రీతిలో హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక భారత్‌ మ్యాచ్‌ను కోల్పోయింది. వన్డేలో తిరుగులేని విజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌ పొట్టి సిరీస్‌లో మాత్రం తడబడడం చర్చనీయాంశంగా మారింది. వర్షం కారణంగా ఐదో మ్యాచ్‌ రద్దుతో సిరీస్‌ సమం కావడంతో పరువు నిలబడింది. లేకుంటే టీ20 క్రికెట్‌లో భారత్‌కు కొంత నష్టం చేకూరేది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ సిరీస్‌తో భారత జట్టు గొప్ప పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీ20లో భారత్‌ బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లో చాలా మెరుగుపడాల్సిన అవసరాన్ని ఈ సిరీస్‌ గుర్తు చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Team India
Cricket
Sports News
Telugu News
Trending News