సుప్రీంకోర్టులో రూ.35 వేల జీతంతో 250 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే జాబ్.. పూర్తి వివరాలివే!
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఈ వార్త మీ కోసమే.. 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అవేంటో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో జాబ్ చేయాలని మీ కోరికా.. అయితే, మీకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సుప్రీంకోర్టులో పనిచేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం లభించబోతోంది.. 2026 సంవత్సరానికి సంబంధించిన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) విభాగంలో ఖాళీగా ఉన్న 250 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారని నోటిఫికేషన్‌లో వెల్లడించారు..
ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ అక్టోబర్ 07 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, అప్లికేషన్ చివరి తేది.. అక్టోబర్ 28 అని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దీనిని దరఖాస్తు చేయాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
ఇక విద్యార్హతలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. అంతేకాకుండా కొన్ని కంప్యూటర్ స్కిల్స్ కూడా తప్పనిసరని తెలిపారు. దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి కనీసం 35 పదాల వేగం కలిగి ఉండాల్సి ఉంటుంది..
ఇక వయోపరిమితి వివరాల్లోకి వెళితే.. అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబర్ 1 రోజుకు తప్పకుండా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తప్పకుండా SC, ఎస్టీ, ఓబీసీతో పాటు దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు రూ.35,400తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయని ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు.
ఇక ఎంపిక విధానానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశలలో ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. అలాగే 100 మార్కులకు జనరల్ ఇంగ్లీష్‌తో పాటు ఆప్టిట్యూడ్, నాలెడ్జ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ 50 మార్కులు ఉంటాయి. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు కూడా 100 మార్కులకు ఉంటాయి. ఇందులో వ్యాసం రాయడం, సారాంశం వంటి అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తిగత ఇంటర్వ్యూలో చివరిగా 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.