• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Coconut Junnu Recipe: పచ్చి కొబ్బరితో కమ్మని జున్ను.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు!

Coconut Junnu Recipe: పచ్చి కొబ్బరితో కమ్మని జున్ను.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు!

Written ByVishnu Priya
Published: Oct 20, 2026, 04:39 PM IST|Updated: Oct 20, 2026, 04:43 PM IST
joinshare

Coconut Junnu Recipe: ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందా? అయితే కేవలం 5 నిమిషాల్లోనే నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి జున్నును తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలు, చక్కెర, కార్న్‌ఫ్లోర్‌తో ఈ సింపుల్ స్వీట్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

 Fresh Coconut Dessert1/5

కొబ్బరి పాలు పుడ్డింగ్

ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందా? అయితే దానితో ఎంతో రుచికరమైన స్వీట్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పచ్చి కొబ్బరిని కూరల్లోనో, చట్నీల్లోనో ఉపయోగిస్తుంటారు. అయితే కొబ్బరితో నోట్లో వెన్నలా కరిగిపోయే జున్ను తరహా డెజర్ట్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో, సులభమైన పద్ధతిలో చేసుకునే ఈ కొబ్బరి జున్ను పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
 Coconut Milk Pudding2/5

కావాల్సిన పదార్థాలు

ఈ స్వీట్ తయారీకి రెండు కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు, రెండు కప్పుల నీళ్లు, అర కప్పు చక్కెర, నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, అర టీ స్పూన్ యాలకుల పొడి అవసరమవుతాయి. కావాలనుకుంటే చివర్లో డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించుకోవచ్చు.
 Easy Sweet Recipe3/5

తయారీ విధానం

ముందుగా పచ్చి కొబ్బరిపై ఉన్న గోధుమ రంగు పొరను తొలగించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మొదట నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. తయారైన మిశ్రమాన్ని పలుచని వస్త్రం లేదా జల్లెడతో వడకట్టి కొబ్బరి పాలను సేకరించాలి. కొబ్బరి నుంచి పాలు పూర్తిగా వచ్చేలా గట్టిగా పిండాలి.
 5 Minute Dessert4/5

కొబ్బరి వంటకాలు

ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. మిగిలిన కొబ్బరి పాలను ఒక గిన్నెలో పోసి స్టవ్‌పై పెట్టాలి. అందులో చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ నిరంతరం కలపాలి. మిశ్రమం చిక్కబడే వరకు తక్కువ మంటపై సుమారు 4–5 నిమిషాలు ఉడికించాలి. అడుగున అంటకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
 Homemade Coconut Sweet5/5

ఫ్రిజ్‌లో ఉంచితే రుచికరమైన స్వీట్ రెడీ!

తయారైన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం ఫ్రిజ్‌లో గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఉంచాలి. అది గట్టిపడిన తర్వాత ప్లేట్‌లోకి తీసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుని వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. పచ్చి కొబ్బరితో తయారయ్యే ఈ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే మొత్తం తయారీకి ఫ్రిజ్‌లో ఉంచే సమయం కూడా పడుతుందని గుర్తుంచుకోండి. మిగిలిన కొబ్బరి తురుమును పారేయకుండా ఉండలు లేదా ఇతర వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.
TAGS:
Festivals
Telugu News
Health

Trending

  • News
  • Photos
  • Videos
Mohali Delivery Person:  కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

2

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

3

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

4

Himachal Pradesh: దేశ మంతా దసరా తర్వాత.. ఇక్కడ వారంపాటు సంబరాలు.!. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంప్రదాయం.!.

5

Graduate MLC: తొలిసారి ఎన్నికల బరిలో కవిత పార్టీ.. కీలక స్థానానికి అభ్యర్థి ప్రకటన

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.