• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Cricket Players: హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత క్రికెటర్లు.. అందరి కళ్లన్నీ వైభవ్‌ వైపు

Cricket Players: హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత క్రికెటర్లు.. అందరి కళ్లన్నీ వైభవ్‌ వైపు

Written By Ravi Kumar Sargam
Published: Oct 13, 2026, 12:56 AM IST|Updated: Oct 13, 2026, 01:04 AM IST
joinshare
India vs West Indies 4th T20I Match In Uppal Stadium: సుదీర్ఘ కాలం భారత జట్టు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌ ఆడేందుకు భారత క్రికెటర్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. వారికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది. మీరు చూసేయండి.

India vs West Indies 4th T20I Match In Uppal Stadium: సుదీర్ఘ కాలం భారత జట్టు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్‌ ఆడేందుకు భారత క్రికెటర్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. వారికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది. మీరు చూసేయండి.

Shreyas Iyer1/8

Shreyas Iyer

Indian Cricketer In Hyderabad: చాలాకాలం తర్వాత భారత జట్టు హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ ఆడేందుకు భారత జట్టు విచ్చేసింది. భారత క్రికెటర్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో సహా అందరూ హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సందడి చేయనున్నారు.
Sanju Samson2/8

Sanju Samson

ఉప్పల్‌ స్టేడియంలో రేపు జరగనున్న మ్యాచ్‌ కోసం భారత క్రికెటర్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శామ్‌సన్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌తో సహా జట్టు ఆటగాళ్లంతా హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తుంటే ప్రేక్షకులు భారీ స్వాగతం పలికారు.
Tilak Varma3/8

Tilak Varma

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారత జట్టులో బాల క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గ్రౌండ్‌లో చెలరేగి ఆడే వైభవ్‌ బయట మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. కొంచెం మాత్రమే నవ్వుతూ ఎయిర్‌పోర్టులో ప్రేక్షకులను పలకరించారు.
Indian Cricketers4/8

Indian Cricketers

ఇక సొంత గడ్డపై తెలంగాణ క్రికెటర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ ఆడనున్నారు. చాలా రోజుల తర్వాత భారత జట్టు తరఫున సొంత గడ్డపై ఈ ఇద్దరు తెలుగు క్రికెటర్లు ఆడబోతున్నారు. సొంత మైదానంలో ప్రతాపం చూపాలని ఇద్దరూ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు.
Vaibhav Sooryavanshi5/8

Vaibhav Suryavanshi

ఈ మ్యాచ్‌పై భారత్‌ భారీ ఆశలు పెట్టుకోగా.. అదే స్థాయిలో ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత మ్యాచ్‌ జరుగుతుండడంతో ఉప్పల్‌ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
Shivam Dube6/8

Shivam Dube

వెస్టిండీస్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో 2,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి వెల్లడించారు.
team india players7/8

team india players

ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో 408 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘా ఉంచనున్న పోలీసులు ప్రేక్షకులను పటిష్టంగా తనిఖీ చేసిన తర్వాతనే స్టేడియంలోకి అనుమతించనున్నారు. మద్యం సేవించి వచ్చే వారిని అనుమతించరు. మ్యాచ్‌ సందర్భంగా ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Cricketers8/8

Indian Cricketers

మ్యాచ్‌ టికెట్లకు సంబంధించి బ్లాక్‌లో కొనుగోలు చేయరాదని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్‌ టికెట్ల కొనుగోలులో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రేక్షకులకు పోలీస్‌ కమిషనర్‌ సుమతి కోరారు.
TAGS:
Cricket
Team India
Hyderabad
Sports News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో విండీస్‌తో భారత్‌ 4వ మ్యాచ్‌.. పోలీసుల పటిష్ట బందోబస్తు

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో విండీస్‌తో భారత్‌ 4వ మ్యాచ్‌.. పోలీసుల పటిష్ట బందోబస్తు

2

Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

3

Governors Appointments: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కేరళం, ఒడిశాకు కొత్త వ్యక్తులు

4

Nandamuri Mokshagna: బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞపై సానుభూతి చూపిస్తున్న తేజస్విని భర్త భరత్.. కారణం ఇదే!

5

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.