• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Jio Dussehra Offer 2026: జియో యూజర్లకు దసరా ఆఫర్.. ఒకే ప్లాన్‌తో వై-ఫై, 1000+ టీవీ ఛానెళ్లు, 12+ ఓటీటీ యాప్స్!

Jio Dussehra Offer 2026: జియో యూజర్లకు దసరా ఆఫర్.. ఒకే ప్లాన్‌తో వై-ఫై, 1000+ టీవీ ఛానెళ్లు, 12+ ఓటీటీ యాప్స్!

Written ByVishnu Priya
Published: Oct 05, 2026, 09:00 AM IST|Updated: Oct 05, 2026, 09:12 AM IST
joinshare

Jio Dussehra Offer 2026: దసరా పండుగ సందర్భంగా రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. జియోహోమ్ పేరుతో అందిస్తున్న కొత్త 3-ఇన్-1 ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలను ఒకే రీఛార్జ్‌తో పొందే అవకాశం ఉంది. జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి.
 

JioFiber plans1/5

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్

దసరా పండుగ కానుకగా రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌లలో అపరిమిత వై-ఫై డేటాతో పాటు 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12కు పైగా ప్రముఖ ఓటీటీ యాప్స్ అందుతాయి. 100 Mbps స్పీడ్ ప్లాన్‌ను రూ.2,122తో రెండు నెలలకు తీసుకోవచ్చు. దీనికి మూడో నెల ఉచితంగా లభిస్తుంది. అంటే మూడు నెలలకు సగటున నెలకు రూ.707 ఖర్చవుతుంది.
 Jio Wi-Fi plans2/5

జియో వైఫై ప్లాన్స్

అలాగే 30 Mbps ప్లాన్ ధర రూ.2,222. ఇది మూడు నెలలకు వర్తిస్తుంది. దీనిపై మరో నెల ఉచితంగా లభిస్తుంది. దీంతో నాలుగు నెలలకు సగటున నెలకు రూ.555 వరకు ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు ఉపయోగించుకునేలా 100 GB అదనపు డేటా కూడా లభిస్తుంది. రెండు ప్లాన్‌లలోనూ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది.
Jio Dussehra Offer 20263/5

టీవీ మాత్రమే కావాలంటే..

ఇంటర్నెట్ అవసరం లేని వారికి జియో ప్రత్యేక టీవీ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. రూ.2,000తో ఐదు నెలల పాటు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో 15కు పైగా ప్రాంతీయ భాషల్లో 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 200కు పైగా HD ఛానెళ్లు ఉన్నాయి. రెండు నెలల ప్యాక్ ధర రూ.1,000గా ఉంది.
Jio 30 Mbps plan4/5

వై-ఫై ప్యాక్‌లు కూడా..

కేవలం ఇంటర్నెట్ కావాలనుకునే వారికి 100 Mbps వై-ఫై ప్యాక్ ఐదు నెలలకు రూ.3,000గా ఉంది. రెండు నెలల ప్యాక్ ధర రూ.1,500. 30 Mbps స్పీడ్‌తో ఐదు నెలల ప్యాక్ రూ.2,200 కాగా, రెండు నెలల ప్యాక్ రూ.1,100గా ఉంది.
 Jio recharge offer5/5

జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్

అయితే అపరిమిత డేటా పేరుతో ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. జియోఫైబర్‌కు నెలకు 3,300 GB, జియో ఎయిర్‌ఫైబర్‌కు 1,000 GB వరకు హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఆ పరిమితి దాటితే ఇంటర్నెట్ పూర్తిగా ఆగదు కానీ వేగం 64 Kbpsకు తగ్గుతుంది.
TAGS:
National News

Trending

  • News
  • Photos
  • Videos
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

2

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

3

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

4

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

5

Maharashtra: మహారాష్ట్రలోని స్కూల్లో దారుణం.. నిద్రలో ఉండగా 500 మంది విద్యార్థుల జుట్టులు కత్తిరింపు.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.