• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /కొండంత టార్గెట్‌ను దాటేసిన ‘రామాయణ’.. 18 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్..

కొండంత టార్గెట్‌ను దాటేసిన ‘రామాయణ’.. 18 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్..

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 13:20 IST|Updated: Nov 23, 2026, 13:42 IST
joinshare

Ramayana Break Even world Wide: రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. యశ్ రావణాసురుడిగా.. సాయి పల్లవి సీతగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామాయణ’. దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు మన దేశంలో అత్యంత ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా కొండంత టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఎట్టకేలకు ఆ కొండను పిండి చేసి ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Ramayana Records1/5

రామాయణ పార్ట్ 1

Ramayana Records : ‘రామాయణ’ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర 18వ రోజు అద్భుతం చేసింది. అంటే రిలీజైన మూడో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా తగ్గడం లేదు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న దాదాపు రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపింది. అంతకాదు నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 1700 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 800 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రూ. 1650 కోట్ల గ్రాస్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్‌గా సాధించిన వసూళ్లలతో అసాధ్యమనుకున్న రికార్డును సుసాధ్యం చేసుకుంది. మొత్తంగా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది.
Ramayana Break Even 2/5

రామాయణ బ్రేక్ ఈవెన్

అంతేకాదు ఈ సినిమా భారతీయ భాషలన్నింటిలోను బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో వచ్చింది. ఇక తెలుగులో ఈ సినిమా రూ. 85 కోట్ల గ్రాస్.. కన్నడలో రూ. 160 కోట్ల గ్రాస్.. మలయాళంలో రూ. 68 కోట్ల గ్రాస్.. తమిళంలో రూ. 61 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్ .. 570 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలం రేపింది. మొత్తంగా $58 మిలియన్ డాలర్స్ రాబట్టింది.
North America Highest Grosser 3/5

నార్త్ అమెరికా హైయ్యెస్ట్ గ్రాసర్

ఇక నార్త్ అమెరికాలో $ 28.5 మిలియన్ డాలర్స్‌తో దురంధర్‌ 2కు చేరువలో ఉంది. మొత్తంగా ఈ రోజుతో దురంధర్ 8 యేళ్ల తర్వాత సెట్ చేసిన నార్త్ అమెరికా రికార్డును ఆరు నెలల గ్యాప్‌లోనే ‘రామాయణ’ సినిమా దాటడం విశేషం. ఈ రోజుతో ప్రస్తుతం నార్త్ అమెరికా ఆల్ టైమ్ టాప్ ఇండియన్ గ్రాసర్స్ లిస్టులో రామాయణ పార్ట్ 1 నెంబర్ వన్ స్థానంలో చేరుకోనుంది. ప్రస్తుతం రామాయణం కంటే ముందు ‘పుష్ప 2’, బాహుబలి 2, దురంధర్ 2, దంగల్ సినిమాలున్నాయి.
5th Place 4/5

5వ స్థానం

మొత్తంగా ఎక్కువ వసూల్లు రాబట్టిన చిత్రాల్లో 5వ స్థానంలో ఉన్న ‘రామాయణ’త్వరలో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్ర, యశ్ సంయుక్తంగా నిర్మించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. ఇందులో నటించిన నటీనటులపై ట్రోల్స్ జరిగాయి. రాముడు పాత్రధాని రణ్‌బీర్, సాయి పల్లవి సీతగా సెట్ కాలేదనేది అందరు చెప్పుకన్న మాట.
Ramayana Part 25/5

రామాయణ పార్ట్ 2

ఏది ఏమైనా 2028 శ్రీరామ నవమి కానుకగా ‘రామాయణ పార్ట్ 2’ విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తంగా రామాయణ ఫస్ట్ పార్ట్ సాధించిన విజయంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ‘రామాయణ పార్ట్ 1’ అంతేకాదు వచ్చే యేడాది చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో విడుదల కాబోతుంది. అక్కడ ఈ సినిమా ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి మరి.
TAGS:
Tollywood
Bollywood
Movie Review

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Panchayat Elections:  ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

Panchayat Elections: ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

2

Naga Chaitanya On Shobitha: శోభితాపై నాగచైతన్యకు ఇంత ప్రేమ ఉందా? ఒక్క మాటతో అంతా బయటపెట్టేశాడు!

3

Viral News: కొడుకు లేడని.. కూతురికి బాధ్యతలు వద్దని.. బతికి ఉండగానే తద్దినం..!

4

Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..

5

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.