Vinayaka Chavithi celebrations: గణేష చతుర్ధి.. వినాయక చవితి వచ్చిందంటే..ప్రతి ఇంటా పండుగ కోలాహలం… ప్రకృతితో మమేకమైన వినాయకుడు.. దేశవ్యాప్తంగా విశేషపూజలు అందుకుంటున్నాడు. పల్లెనుంచి మహానగరాల దాకా వీధివీధినా వెలసి వినాయకులు ముగ్థ మనోహరుడిగా భక్తులను అలరింపజేస్తున్నాడు. రూపం ఏదైనా వినాయకుడు వేల వేల రూపాల్లో దర్శనమిచ్చారు. ప్రకృతిలో వినాయకుడి రూపం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ నలుమూలలా వినాయకుడిని వైవిధ్యంగా రూపొందించిన భక్తులు భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాన్ని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వినాయకుడి విభిన్నరూపాలు, ఆయన పూజలు అందుకున్న తీరూతెన్నులు ఇపుడు చూదాం.