Cyclone Arnab Effect in Telangana: అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తుఫాను కదిలే క్రమంలో తెలంగాణలో వర్షాల తీవ్రతలో మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అర్నాబ్ తుఫాను ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఈ రోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వారం రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీని వణికిస్తున్న అర్ణబ్ తుఫాను చాలా జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణపై కూడా దాని ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. తుఫాను ప్రభావంతో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 50 -60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే ప్రకటించడంతో, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయి. నిన్నటి నుంచే వాతావరణం పూర్తిగా మారిపోయింది. అర్నాబ్ తుఫాను ఇప్పటికే యానం దగ్గర తీరం దాటిన నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ వాతావరణం పూర్తిగా చల్లబడింది. రేపు ఉదయం వరకు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం..
ఈ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మంలో సమీక్ష అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి సచివాలయంలో జిల్లాలకు సంబంధించిన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్షాల నేపథ్యంలో పంటలకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున, ఏ జిల్లాల్లో ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఆరా తీశారు. ఒకవేళ పెద్ద ఎత్తున విపత్తు వచ్చి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. నిరంతరం ప్రజలతో ఉండి వర్ష పరిస్థితులను తెలుసుకొని ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, వారికి సంబంధించి రెస్క్యూ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
లోతట్టు ప్రాంతాలకే ముప్పు..
ఈ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకే ఎక్కువ ముప్పు ఉంటుంది కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుకోని వరదలు సంభవిస్తే వారికి పునరావాసం కల్పించాలని కూడా ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఈ రోజు, రేపు కూడా అర్ణబ్ తుఫాను పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరంతరం దీనిపై పర్యవేక్షణ చేయాలి. వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అనుకోని విపత్తులు వచ్చే పరిస్థితులు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు, రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కొంత ఊరట కలిగే అంశమని చెప్పవచ్చు. చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
రైతులకు ఇబ్బందులు..
ఎల్‌నినో ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అర్ణబ్ తుఫాను ప్రభావంతో కొంత మేర పంటలకు నష్టం జరిగినప్పటికీ, పెద్ద ఎత్తున రైతులకు, ప్రజలకు లాభమే జరుగుతుందని చెప్పవచ్చు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు, రేపు కురిసే వర్షాలు తెలంగాణ ప్రజలకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే భారీ ఈదురుగాలులు వస్తే రైతాంగానికి, ప్రజలకు కొంత నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో పడే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఎవరూ బయటకు వెళ్లవద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే ప్రజలు, రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.