• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పీఎం కిసాన్ రూ.2,000 మీ ఖాతాలో పడ్డాయా? భారత్ విస్తార్ యాప్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!

పీఎం కిసాన్ రూ.2,000 మీ ఖాతాలో పడ్డాయా? భారత్ విస్తార్ యాప్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా బలంగా చేయడానికి ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తుంది. ఇది వారి సాగు ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. అయితే, అక్టోబర్‌ 30వ తేదీ పీఎం కిసాన్‌ 24వ విడుత నిధులు మంజూరు కానున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఫోన్‌లోనే భారత్‌ విస్తార్‌ యాప్‌లో కూడా మీ పేమెంట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 28, 2026, 10:06 AM IST|Updated: Oct 28, 2026, 10:10 AM IST
joinshare
పీఎం కిసాన్ రూ.2,000 మీ ఖాతాలో పడ్డాయా? భారత్ విస్తార్ యాప్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!
Image Credit: PM Kisan yojana:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

2

సాంసంగ్ Galaxy A08 లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర ఎంతంటే?

3

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

4

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

5

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Kisan yojana: కేంద్ర ప్రభుత్వం ప్రారభించిన పీఎం కిసాన్‌ యోజన ద్వారా మీరు ప్రయోజనం పొందుతున్నారా? అయితే, 24వ విడుతు రూ.2000 పడ్డాయో లేదా? అని మీ ఫోన్‌లోనే భారత్‌ విస్తార్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఏడాది రైతుల ఖాతాలలో డెరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా మీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బులు రూ.6000 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లో మీ పేమెంట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం భారత్‌ విస్తార్‌ యాప్‌ను కూడా ప్రారంభించింది. ఈ యాప్‌లో మీరు పీఎం కిసాన్‌ ఎన్ని విడుతల నుంచి డబ్బులు పొందుతున్నారు కూడా సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. ఎక్స్‌ వేదికగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రోగ్రామ్‌  ఈ భారత్‌ విస్తార్‌ యాప్‌ వివరాలను పంచుకుంది. ఈ పథకంలో అర్హులైన ప్రతి రైతు ఏడాదికి రూ.6000 పొందుతున్నారు.

ఈ యాప్‌లో బెనిఫిషియరీ స్టేటస్‌ కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత వివరాలు పొందవచ్చు. అదనంగా పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ లేదా పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా మీ పేమెంట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్‌ 24వ విడుత చెక్‌ చేసుకునే విధానం..
మీ పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యాయా? లేదా? అని మీరు సింపుల్‌గా ఈ యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
ముందుగా మీ పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. అక్కడ 'ఫార్మర్‌ కార్నర్‌' సెక్షన్‌ క్లిక్‌ చేస్తే, Know your status ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ నమోదు చేయాలి. అప్పుడు స్క్రీన్‌ప మీ అప్లికేషన్‌ పేమెంట్‌ వివరాలు కనిపిస్తాయి. ఇక పీఎం కిసాన్‌ విస్తార్‌ యాప్‌ ద్వారా ఇలాగే వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 155261 నెంబర్‌కు కాల్‌ చేసి వివరాలు అడగవచ్చు.

 

For more PM-Kisan information download the BharatVistaar app or call 155261 PM-KISAN empowers eligible farmer families with ₹6,000 annually in three instalments through DBT. With online registration and beneficiary status tracking, accessing scheme benefits is easier than ever. https://t.co/35R4LwymiH

— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) October 27, 2026

 

Read Also: పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా? కేంద్రం తెచ్చిన 'భారతీ' యాప్‌తో ఒక్క క్లిక్‌తో పరిష్కారం!

Read Also: అక్టోబర్ 30న పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు విడుదల! ఎవరికి వస్తాయి? ఎవరు అనర్హులు? వివరాలివే!

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?
ఇక మీరు కూడా ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీరు అప్లికేషన్‌ సబ్మిట్‌ చేయాల్సి  ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేస్తే మీ స్టేటస్‌ ట్రాక్‌ చేయవచ్చు. అయితే, అర్హులైన రైతులు మాత్రమే ఈ పీఎం కిసాన్‌ నిధులు పొందుతారు.

ఫిర్యాదులు ఇలా చేయండి..
పీఎం కిసాన్‌ అప్లికేషన్‌ సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో Know Your Status ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు అదనంగా హెల్ప్‌డెస్క్‌ కూడా ఉంటుంది. ఫార్మర్‌ కార్నర్‌ లేదా హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్ కూడా చేయవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
PM Kisan
PM Kisan 2026
Govt Schemes
National News