అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..
Cyclone Effect on Telangana: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే కాదు.. ఏపీ ని ఆనుకొని ఉన్న జిల్లాల్లో పెద్ద ప్రభావమే చూపించనుంది. తుపాను ప్రభావంతో ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నట్టు అధికారులు తెలిపారు.
Weather Update on Telangana: అర్నబ్ తుపాను వాయుగుండంగా మారి ఈ నెల 28న తుపానుగా రూపాంతరం చెందనుంది. అంతేకాదు విశాఖ పట్నం బాపట్ల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలు..
మరోవైపు వరంగల్, మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురవనున్నాయి.
ఎల్ నినో ప్రభావం..
మొత్తంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్‌లలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాల సీజన్‌లో కావాల్సిన వర్షపాతం కంటే తక్కువే నమోదు అయింది. ఎల్‌నినో ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో సరైన మోతాదులో పంటలు పండకపోవడంతో బియ్యం ఇతర నిత్యావసర సరుకులు ధరలకు రెక్కలు వచ్చాయి. అంతేకాదు ఎల్‌నినో ప్రభావంతో చాలా చోట్ల చెరువులు, బోర్లు ఎండిపోయాయి. ఈ సారి బతుకమ్మ పండగకు చాలా చోట్ల కుంటల్లో చెరువుల్లో నీళ్లు పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో అర్నబ్ తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరాల వర్షాలు కురిస్తే భూగర్భ జలమట్టాలతో పాటు చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ రకంగా కొద్దిలో కొద్దిగా కరువును ఎదర్కోవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 16.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తుపాను ప్రభావంతో పాటు రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలుపుతున్నారు.