SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

BRS MLA Padi Kaushik Reddy Face Disciplinary Action: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అటు ఉంచితే.. అసెంబ్లీ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డిపై వేటు వేయడానికి కత్తి వేలాడుతుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమైంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు పడుతుందా లేదా అనేది చూడాలి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 10:39 AM IST | Updated: Oct 24, 2026, 10:45 AM IST
Image Credit: Padi Kaushik Reddy (File/Source)
Join

Padi Kaushik Reddy: BRS హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేలాడుతుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి పెద్ద గండం వచ్చినట్టు కనిపిస్తుంది.  తాజాగా కౌశిక్ రెడ్డి వివరణతో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సంతృప్తి చెందిందా లేకా అతనిపై అనర్హత వేటు వేయన అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ తీర్పును నవంబర్ 5 వ తేదీ వరకు వాయిదా వేయడంతో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీనిర్ణయం ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ సమావేశం నిన్న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. నవంబర్ 5 వ తేదీవరకు వాయిదా వేయడంతో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.  


అసెంబ్లీలో కడియం శ్రీహరితో వాగ్వాదం.. 
అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో వాగ్వాదానికి దిగడం తనను కించపరిచే విధంగా చూపుడు వేలు హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. కౌశిక్ రెడ్డి ప్రవర్తన పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి పరిశీలనకు వెళ్లింది. దీంతో పరిశీలన చేపట్టిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. వచ్చిన ఫిర్యాదు పై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేని యెడల చర్యలు ఎందుకు తీసుకోరాదో సూచించింది.

ఎథిక్స్ కమిటీ నోటీసుకు 12 పేజీలతో కూడిన లిఖిత పూర్వక వివరణ.. 
దీంతో కౌశిక్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఎథిక్స్ కమిటీ నోటీసుకు 12 పేజీలతో కూడిన లిఖిత పూర్వక వివరణ సమర్పించారు.దీనిపై ఎథిక్స్ కమిటీ సంతృప్తి చెందుతుందా లేదా అనేది చూడాలి. ఆయన్ని ఎమ్మెల్యేగా డిస్‌క్వాలిఫై చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే అనుచిత ప్రవర్తన కారణంగా ఎమ్మెల్యేగా పదవి కోల్పోయిన తొలి తెలంగాణ ఎమ్మెల్యేగా నిలుస్తారు. దీంతో హుజురాబాద్‌కు మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న మూడో ఉప ఎన్నిక. త్వరలో ఎన్నికల సంఘం ఈ స్థానానికి సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES