SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్‌ జోష్యం

KCR Will Become Again Chief Minister: తెలంగాణ రైతులకు రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడని.. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయని చెప్పారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 26, 2026, 05:50 PM IST | Updated: Sep 26, 2026, 05:56 PM IST
Image Credit: KTR Comments
Join

KCR Once Again CM: 'పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సమయం ఇవ్వాలని చెప్పారు. మూడేళ్లు కేసీఆర్ కనిపించకపోయినా గల్లీ గల్లీలో కేసీఆర్ పాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు' మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'కోదాడ, సూర్యాపేట దాకా సాగునీళ్లు ఇచ్చిన కేసీఆర్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు' అని తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని ఇనుగుర్తికి చెందిన నాయకులు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలోకి చేరారు. ఆ నాయకులను పార్టీలోకి ఆహ్వానం పలికిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మోసగాళ్లనే ప్రజలు నమ్ముతారని రేవంత్‌రెడ్డి ముందే చెప్పాడు. పాత రోజులు తెస్తానని రేవంత్‌రెడ్డి చెప్పాడు. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు' అని విమర్శించారు.

'కేసీఆర్ నాట్లు వేసే సమయానికి రైతుబంధు వేసేవారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడు. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తానని చెప్పి చేయలేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా అమలు చేయలేదు. ఎవరు గెలిచినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు అనుకున్నారు. ఎవరొచ్చినా సంక్షేమ పథకాలు బంద్ కావని ప్రజలు అనుకున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

'అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోతదని ముందే చెప్పాం. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి గుద్దితే ఆ వ్యక్తి కనబడకుండా పోయాడు. ఇనుగుర్తిలో పుట్టిన ఈ ఉద్యమం మహబూబాబాద్ జిల్లా అంతా పాకాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి గ్రాడ్యుయేట్స్ అంతా ఓటు నమోదు చేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఏంటో చెప్పడానికే ఈ ఎన్నికలు. ఈ దోపిడీ, అవినీతి పాలన పోవాలంటే మీ చేతుల్లోనే ఉంది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

చాకలి ఐలమ్మకు నివాళి..
పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి, భుక్తి కోసం పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. పేదలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES