• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR Bus Yatra: గులాబీ పార్టీలో ఫుల్‌ జోష్‌.. తెలంగాణలో కేటీఆర్‌ బస్సు యాత్ర

KTR Bus Yatra: గులాబీ పార్టీలో ఫుల్‌ జోష్‌.. తెలంగాణలో కేటీఆర్‌ బస్సు యాత్ర

KT Rama Rao Bus Yatra From November 11th To 14th: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. కేటీఆర్‌ బస్సు యాత్రతో గులాబీ పార్టీలో ఫుల్‌ జోష్‌ రానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 02, 2026, 12:54 PM IST|Updated: Nov 02, 2026, 01:28 PM IST
joinshare
KTR Bus Yatra: గులాబీ పార్టీలో ఫుల్‌ జోష్‌.. తెలంగాణలో కేటీఆర్‌ బస్సు యాత్ర
Image Credit: Source: KT Rama Rao Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

2

Rajgopal Reddy: కాంగ్రెస్‌లో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేరు.. సీఎం రేవంత్ పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

3

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

4

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

5

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

KCR Deeksha Divas: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు.. రేవంత్‌ రెడ్డి మోసాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర పోరాటం చేస్తూనే ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఒకటే రక్ష అని చెబుతున్నారు. అంతేకాకుండా నిస్తేజంలో ఉన్న గులాబీ పార్టీ శ్రేణుల్లో పూర్తి ఉత్సాహం నింపుతున్నారు. ఇకపై కేటీఆర్‌ మరింత స్పీడ్‌ పెంచనున్నారు. పార్టీ కేడర్‌కు ఉత్సాహం నింపుతూనే రైతులు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఒకటే అండగా ఉంటుందనే సందేశం ఇచ్చేందుకు కేటీఆర్‌ భారీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా భారీ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ అలుగునూర్ వద్ద అరెస్టయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీల్లో ప్రత్యేక బస్సు యాత్ర జరగనుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు.

మేడిగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమై.. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పరిస్థితి, రైతులకు అందుతున్న సాగునీరు, నీటి పంపిణీ, ప్రాజెక్టుల ద్వారా కలగాల్సిన ప్రయోజనాలు, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తూ.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేటీఆర్‌ ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో రైతులకు అందిన సాగునీరు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో ప్రజల ముందుంచబోతున్నారు. సాగునీటితోపాటు తాగునీరు, విద్యుత్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల ఇబ్బందులను కూడా ప్రజాక్షేత్రంలో ప్రస్తావించనున్నారు.

భారీ ప్రణాళిక
బస్సు యాత్రతోపాటు గ్రామస్థాయిలో కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా, స్థానిక సమావేశాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. దీక్షా దివస్ ఉత్సవాల నిర్వహణ, కేటీఆర్ బస్సు యాత్ర, రైతుల సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, పుట్ట మధు, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దేవేందర్ రెడ్డి, కోలేటి దామోదర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అలుగునూర్‌లో దీక్షా దివస్ సభ
నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూర్ లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అరెస్టు జరిగిన అలుగునూర్ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
BRS
Karimnagar
Politics
Telangana News