SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్‌ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 28, 2026, 06:07 PM IST | Updated: Sep 28, 2026, 06:53 PM IST
Image Credit: KTR With Farmers
Join

KTR vs Revanth Reddy: 'పేదవాళ్లను కొట్టి పెద్దలకు పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అందుకే బుల్లెట్ ట్రైన్ పేరు మీద సుమారు రూ.5 వేల కోట్లు విలువ చేసే 650 ఎకరాల బహుదూర్‌గూడ భూమి మీద రేవంత్ కన్ను పడింది. భూములు కొనాలి, అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం తీసుకున్న భూమిలో 3 వేల ఎకరాలు ఖాళీ ఉంది.. దాంట్లో నుండి బుల్లెట్ ట్రైన్ కోసం తీసుకోరాదా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాలుగు తరాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కుంటున్నారు. పదేళ్లలో ఒక్కరోజు కూడా మీ భూముల జోలికి కేసీఆర్ రాలేదు. మంచి చేశాడు కాబట్టే కేసీఆర్ పాటలు పెడుతున్నారు. పైసలు ఇస్తే ఎవరైనా పాటలు పెట్టుకుంటారా? పోలీసులు అసలు పని వదిలిపెట్టి, గద్దల్లా ప్రజల భూములపై పడుతున్న నాయకులకు వత్తాసు పలుకుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

'బలరాం నాయక్, వివేక్ వెంకటస్వామి భూములు కనిపించవా? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల భూములు తీసుకోవడమా? పొంగులేటి, వివేక్, రేవంత్ రెడ్డి సోదరుల ఇళ్లు కనిపించవా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని తెలిపారు. 'ఎయిర్‌పోర్ట్ భూముల్లో 13 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కదా. ఆ భూమిని బుల్లెట్ ట్రైన్ కోసం తీసుకోవచ్చు కదా. మరి వీరి భూములే ఎందుకు? రేవంత్ రెడ్డికి భూములు అమ్మడం, కమిషన్లు తీసుకోవడమే పని' అని విమర్శించారు.

'రేవంత్ రెడ్డికి రూ.5,000 కోట్ల కమీషన్ కనిపిస్తుందేమో కానీ, పేదల భూములు కనిపించడం లేదు. కోర్టు మీకు అండగా ఉంది. కంచెలు ఉన్నాయి, పోలీసులు ఇంకా అక్కడే ఉన్నారు. ఒక్క ఏడాది పోరాటం చేయండి. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి కూడా పోరాడుదాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. 'కాలుష్యం వెదజల్లకుండా అధునాతన టెక్నాలజీతో ఫార్మా సిటీ నిర్మించడానికి, ఏడేళ్లు కష్టపడి చట్టప్రకారం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశాం. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తమని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పుడు అవే భూములతో ఫ్యూచర్ సిటీ పేరు మీద భూ దందా చేస్తున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

'ఫార్మా సిటీ భూములను రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, దోస్తులు, బినామీలు 4-5 వేల ఎకరాల భూమి తీసుకొని పెట్టుకున్నారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములు వేరే వాటికి వాడరాదు.. ఎవరైనా తెలిసో, తెలియకో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడితే మోసపోతారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES