Revanth Reddy PRTU TS meeting: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర నూతన కార్యవర్గం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిపింది. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి భిక్షం గౌడ్, బట్టాపురం మధుసూదన్ రెడ్డిలతో కలిసి సీఎంకు పలు కీలక డిమాండ్లను విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్‌తో ఉద్యోగులకు అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
ప్రస్తుతం హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. ఈ నెల 15వ తేదీలోపు తానే స్వయంగా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలోనూ మెరుగైన వైద్యం అందేలా అవసరమైన ఒప్పందాలు జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, సీపీఎస్ (CPS) రద్దు చేయాలని.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ నాయకులు సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పేరి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు వారంలో 5 రోజుల పని విధానం అమలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు కోరారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, కరవు పరిస్థితుల ను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కుటుంబ అవసరాలను పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయా లన్నారు.
బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబును జేఏసీ నేతలు ముజీబ్, శ్యామ్, కస్తూరి వెంకట్, సత్యనారాయణగౌ డ్, శ్రీకాంత్ తో మంత్రిని కలిశారు. 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యో గుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంత్రిని కోరారు. ఉద్యోగ సంఘాలకు ప్రభు త్వం గుర్తింపు కల్పించాలని కోరారు.
ఈహెచ్ ఎస్ అమలుపై చొరవ చూపాలన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాల న్నారు. జేఏసీ వినతులపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూల స్పందించారని నేతలు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
Also Read: