Elnino Effect: పండగ వేళ బిగ్ షాక్.. సెంచరీకి చేరువలో బియ్యం ధరలు.. సామాన్యులు లబో దిబో..
Rice price hikes in Telangana: బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఎల్ నినో ప్రభావంను సాకుగా చూపిస్తు కొంత మంది వ్యాపారులు బియ్యం ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం సెంచరీకి చేరువలో వీటి ధరలు ఉన్నాయి.
Rice prices hits 100 per kg over el nino impact in Telangana: దేశమంతట ఇప్పుడు ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. ఇక వాతావరణంలో మార్పుల వల్ల తగినంత వర్షాలు కూడా కురవలేదు. ఇక చలికాలంలో కూడా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్, మార్చిలో ఉండాల్సిన ఎండలు అక్టోబర్ మాసంలో కన్పిస్తున్నాయి. దీంతో మరికొన్ని నెలల పాటు దీని ప్రభావం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరోనా మహామ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో ప్రస్తుతం ఎల్ నినో మహామ్మారి అదే విధంగా దాపురించిందని చెప్పారు.
తాగు నీరు, సాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ సమయంలో నీళ్లను ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకొవాలని సూచించారు. అయితే.. ఎల్ నినో ప్రభావం సామాన్యులకుమాత్రం చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు సన్న బియ్యం ధరలు 65 నుంచి 75 ఉండేవి.
అవి కాస్త ఏకంగా పలుచోట్ల 95 నుంచి 100 రూ. కేజీ వరకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రైస్ మిల్లర్లు, వ్యాపారులు మూకుమ్మడిగా కావాలని బియ్యం కోరతను క్రియేట్ చేసి మరీ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు చోట్ల సన్నరకం బియ్యంను 100 రూపాయలకు సైతం విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి గడ్డుకాలంలో ఎదుర్కొవాలో అంటూ సామాన్యులు లబో దిబో మంటున్నరు.
మరోవైపు రైతులు వరిని కాకుండా ఇతర పంటలు వేసుకొవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పలుచోట్ల అక్టోబర్ నెలలోనే నీళ్ల కటకట మొదలయ్యాయి. ట్యాంకర్ లకు డిమాండ్ పెరిగింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయ్యారు. నీళ్లను పొదుపుగా ఉపయోగించుకొవాలని దండోరా వేసి మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.