SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!!

School Van Accident: మహబూబాబాద్ జిల్లాలో శనివారం త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ వాహనం డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కురవి మండలం తిర్లాపురం గ్రామ శివారులో జరిగిన ఈ భయంకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది.

Written By Bhoomi
Published: Oct 31, 2026, 05:56 PM IST | Updated: Oct 31, 2026, 05:57 PM IST
Image Credit: School Van Accident:
Join

School Van Accident: మహబూబాబాద్ జిల్లాలో శనివారం త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ వాహనం డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కురవి మండలం తిర్లాపురం గ్రామ శివారులో జరిగిన ఈ భయంకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది.

స్థానికులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. కురవి మండల కేంద్రంలో ఉన్న గీతాంజలి స్కూల్ కు చెందిన టాటా మ్యాజిక్ వాహనం శనివారం ఉదయం రోజువారీ మాదిరిగానే విద్యార్థులను ఎక్కించుకుని సమీప గ్రామాలకు వెళ్ళింది. పలు గ్రామాల నుంచి సుమారు 14 మంది విద్యార్థులను వాహనంలో ఎక్కించుకుని స్కూల్ తిరిగి వస్తుండగా.. తిర్లాపురం సమీపంలో ప్రమాదం జరిగింది.

వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ.. అజాగ్రత్త వహించడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వాహనం అదుపుతప్పిన పక్కనే ఉన్న చెరువులోకి పల్టీలు కొట్టిందని తెలిపారు.

ఈ ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమయస్పూర్తితో స్పందించి విద్యార్థులను వాహనంలో నుంచి బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందనేది వివరాలు తెలియాల్సి ఉంది.

స్కూల్ వ్యాన్ చెరువులోకి దూసుకెళ్లిందన్న సమాచారం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రమాద స్థలానికి పరుగెత్తుకుంటూ చేరుకున్నారు. స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Also Read: 

2 లక్షల మందికి  కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

 

పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు

 

అనంతపురం జిల్లాలో  పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES