నేటి నుంచే తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ..కొడంగల్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..!!
Telangana Cheyutha New Pensions: తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద అర్హులైన పేదలకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4.50 లక్షల మంది కొత్త పింఛన్లను మంజూరు చేసింది.
Telangana Cheyutha New Pensions: తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద అర్హులైన పేదలకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4.50 లక్షల మంది కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలనలో మొత్తం 5.50 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 4.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
ఈ కొత్త జాబితాలో అత్యధికంగా 3 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే 1 లక్ష మంది దివ్యాంగులు, 50 వేల మంది నేత గీత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ నెల నుంచి వీరికి పెన్షన్లు అందనున్నాయి. కొడంగల్లో సీఎం ప్రారంభించిన అనంతరం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో అర్హులైన లబ్దిదారులకు ఈ పెన్షన్ మంజూరు పత్రాలను అందిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కొత్త పెన్షన్లు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఇప్పటి వరకు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, సంప్రదాయ వ్రుత్తులపై ఆధారపడిన నేత, గీత కార్మికులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చనుంది. కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి, అర్హతను నిర్ధారించింది. ఈ ప్రక్రియ అనంతరం, 450,000 మంది పింఛనుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 300,000 మంది వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. మరో 100,000 మంది దివ్యాంగులు కాగా, 50,000 మంది నేత కార్మికులు, గీతా కార్మికులు ఉన్నారు.
కొత్త పింఛన్ల పంపిణీతో మరింత మంది సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వస్తారు. అర్హులైన వ్యక్తుల జీవన అవసరాలను తీర్చడానికి వారికి నెలవారీ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీపావళి పండుగ సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం వారి కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. అధికారులు ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ నెలలో వారి ఖాతాలకు పింఛన్లు జమ చేయబడతాయి.