Festival Special Recipes: దీపావళి పండుగ ప్రత్యేకంగా ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోగలిగే కరకరలాడే స్నాక్ పోహా చివ్డా. అటుకులు, వేరుశనగలు, పుట్నాలు, గుమగుమలాడే కరివేపాకు కలయికతో చేసే ఈ రుచికరమైన చిరుతిండి చాలా తక్కువ సమయంలోనే సిద్ధమవుతుంది. పండుగ రోజుల్లో చుట్టాలకు అందించడానికే కాకుండా, రోజువారీ టీ టైమ్‌లో నమలడానికి కూడా ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
4 నుంచి 5 గురించి సరిపోయే విధంగా పోహా చివ్డా ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పలుచని అటుకులు – 3 కప్పులు
వేరుశనగలు – ½ కప్పు
పుట్నాలు – ¼ కప్పు
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
చక్కెర పొడి – 1 టీ స్పూన్ (ఐచ్ఛికం)
ఉప్పు – తగినంత
నూనె – 2–3 టేబుల్ స్పూన్లు
ఇంగువ – చిటికెడు
ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం:
ముందుగా అటుకులు ఎలా వేయించాలో చూద్దా. ముందుగా మందపాటి పాన్ వేడి చేయాలి. అందులో పలుచని అటుకులు వేసి తక్కువ మంటపై 3–4 నిమిషాలు వేయించాలి.అటుకులు కరకరలాడేలా మారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఇప్పుడు డ్రైఫ్రూట్స్, వేరుశనగలు వేయించడం:
అదే పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. వేరుశనగలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు, పుట్నాలు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి.తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించాలి.
ఇప్పుడు ముఖ్యమైంది మసాలా కలపడం:
ఇప్పుడు మంట తగ్గించి పసుపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. వేయించిన అటుకులను వేసి మసాలా అంతా పట్టేలా నెమ్మదిగా కలపాలి.
చివరగా చక్కెర పొడి వేసి మరోసారి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
నిల్వ చేసుకునే పద్దతి తెలుసుకుందాం:
పోహా చివ్డా పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే కరకరలాడే రుచి ఎక్కువకాలం ఉంటుంది.పలుచని అటుకులు ఉపయోగిస్తే మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. అటుకులను ఎక్కువ మంటపై వేయించకూడదు. కరివేపాకు, పచ్చిమిర్చిలో తేమ లేకుండా వేయించాలి. చివ్డా పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో పెట్టాలి. మరింత రుచి కోసం కొద్దిగా వేయించిన నువ్వులు కూడా కలుపుకోవచ్చు.
Also Read: