బూడిద గుమ్మడికాయ దిష్టికే కాదు… సర్వరోగ నివారిణి ! మానసిక ఆరోగ్యానికి కూడా!
సాధారణంగా నరదృష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మాలకు బూడిద గుమ్మడికాయను కడుతుంటారు. అయితే ఇది కేవలం దిష్టి కోసం మాత్రమే కాదు, దీనివల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అసలు గుమ్మడికాయ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఎవరు దీనిని తీసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బూడిద గుమ్మడికాయను ఇంగ్లీష్‌లో యాష్ గార్డ్ (Ash Gourd) అని పిలుస్తారు. నరదృష్టిని నివారించడానికి దీనిని ఇంటి గుమ్మాలకు కడుతుంటారు. వీటిని దిష్టి తీయడానికి, దీపారాధనకు, పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే వంటల్లో కూడా వాడుతుంటారు. బూడిద గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగించబడతాయి. గుమ్మడికాయ కేవలం ఇంటి గుమ్మాలకు కట్టడానికే కాదు, శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియం, విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో 96 శాతం పైగా నీరు ఉంటుంది.
రెగ్యులర్‌గా గుమ్మడికాయ తీసుకోవడం వల్ల కడుపులోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది ప్రోబయాటిక్, డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తూ శరీరంలోని లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ గుమ్మడికాయ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ అనజియోలైటిక్ ప్రభావం వల్ల ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడేవారు దీనిని తీసుకోవడం వల్ల సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా, బరువు తగ్గాలనుకునే వారు గుమ్మడికాయ జ్యూస్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఇది వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఫ్యాట్ సున్నా కాబట్టి ఇది యాంటీ డయాబెటిక్ లాగా కూడా పనిచేస్తుంది, ఇది మధుమేహ రోగులకు మంచి ఎంపిక.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినకుండా ఉండవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంద. రక్తహీనతతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఇది మైక్రోబయాల గుణాలను కలిగి ఉండటం వల్ల పారాసైటిక్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ఇస్తుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.
Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!
గుమ్మడికాయ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. గుమ్మడికాయ తొక్క, గింజలు తీసివేసి, దాని గుజ్జుతో రసం చేసుకుని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఇది చలువ చేసే గుణం కలిగిన పండు కాబట్టి, వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే దీనిని తీసుకోవాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)