మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దిండు తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే పడుకోవడం కష్టమవుతుంది. అయితే ప్రతిరోజూ దిండుపై పడుకోవడం వల్ల, ముఖం నుండి వచ్చే ఫేషియల్ ఆయిల్స్, జుట్టులోని నూనె ఇతర దుమ్ము ధూళి కారణంగా దిండుపై పచ్చని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలతో పాటు ఆయిల్ మార్కులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు వీటిని ఉతకడం కూడా కష్టమవుతుంది. కానీ ఇంట్లో ఉండే బేకింగ్ సోడా, వెనిగర్‌ను ఉపయోగించి ఈ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దిండుపై ఉండే ఆయిల్, మాయిశ్చర్,బ్యాక్టీరియా కూడా తొలగిపోతాయి.
Yellow Pillow Stains Removal: మన శరీరంలోని చర్మం నుండి వచ్చే నూనెలు, హెయిర్ ప్రొడక్ట్స్ ఇతర మలినాల వల్ల దిండుపై మచ్చలు పడతాయి. వీటిలోని ఫ్యాట్స్, ప్రోటీన్ల వల్ల పచ్చని మరకలు ఏర్పడటమే కాకుండా, దిండు నుండి దుర్వాసన కూడా వస్తుంది. వీటిని తొలగించడానికి బేకింగ్ సోడా, నీటిని సమాన పరిమాణంలో కలిపి ఒక మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. పచ్చని మరకలు ఎక్కువగా ఉన్న చోట ఈ పేస్ట్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దానిపై వైట్ వెనిగర్ స్ప్రే చేసి, ఉతికితే మచ్చలు పోతాయి.
మరో పద్ధతిలో, ఒక భాగం నిమ్మరసం, రెండు భాగాలు గోరువెచ్చని నీరు, వైట్ వెనిగర్ కలిపి మచ్చలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి; సూర్యరశ్మి సహజమైన బ్లీచ్‌లా పనిచేసి మరకలను పోగొడుతుంది.
ఇకపై ప్రతి వారం దిండును శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేయడం తప్పనిసరి. మచ్చలు, హెయిర్ ప్రొడక్ట్స్ దిండుపై పడకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ పిల్లో ప్రొటెక్టర్ ఉపయోగించండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లో కేస్‌లను రెండేళ్లకోసారి మారుస్తూ ఉండాలి. పిల్లో కేస్‌లను శుభ్రం చేసేటప్పుడు సాధారణ డిటర్జెంట్ల కంటే బేకింగ్ సోడా వంటి సహజమైన ఉత్పత్తులను వాడటం వల్ల అవి డీప్ క్లీన్ అవుతాయి.
మనం ప్రతిరోజూ ఉపయోగించే దిండ్లు, బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి, తద్వారా మంచి నిద్ర లభిస్తుంది. బయట నుండి వస్తూ కూర్చుంటూ, పడుకుంటూ ఉండటం వల్ల వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు ఈ దిండ్లను అసలు ఉపయోగించకపోవడమే మంచిదని సూచించినప్పటికీ, చాలామందికి ఇవి అలవాటుగా ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యం బాగుండాలంటే పిల్లో కేసులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే, కాటన్ పిల్లో కేసులను ఉపయోగించడం వల్ల హెయిర్ కేర్‌కు మరింత మేలు జరుగుతుంది.