కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!
ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ మాసం వచ్చిందంటే చాలు శివపూజలు, వన భోజనాలు, ఉసిరి దీపాలు ప్రత్యేకం. అయితే, ఉసిరి కాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు ముఖం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Amla benefits for skin and hair: ఉసిరికాయ.. దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమూనిటీ వ్యవస్థను కూడా పెంచుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ మాసం ప్రత్యేకం ఉసిరికాయ, దీంతో మన శరీర ఆరోగ్యంతోపాటు సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మన బామ్మల కాలంనాటి నుంచి ఉసిరికాయను జుట్టు ఆరోగ్యానికి వాడుతుంటారు. ఈ ఉసిరికాయతో తయారు చేసిన క్యాండీలు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనల్స్, కావాల్సిన ఖనిజాలు ఉసిరి అందిస్తుంది. ఇది చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీంతో మచ్చ లేని చర్మంతోపాటు మెరిసే నల్లని జుట్టు కూడా మీ సొంతం అవుతుంది.
ఆయుర్వేద పరంగా కూడా ఉసిరిలో సహజమైన గుణాలు ఉంటాయి. వీటిని నూనె, హెర్బల్ షాంపూ, ఫేస్ ప్యాక్స్ కొన్ని డైటరీ ఫుడ్స్ కూడా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేటీవ్ స్ట్రెస్ బారిన పడకుండా కపాడుతుంది. ఇది చర్మానికి సాగే గుణం కూడా అందిస్తుంది. ఉసిరిని తాజాగా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. లేదా పౌడర్ కూడా ఉంటుంది.
కాంతివంతమైన చర్మం..
ఉసిరిలో విటమిన్ సీ, మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో స్కిన్ సెల్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. సూర్యుని హానికరం కిరణాలు, కాలుష్యం బారి నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. దీంతో సహజంగా మీ చర్మం మెరుస్తుంది.
కొల్లాజెన్ ఉత్పత్తి..
ఉసిరిలోని విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సాగే గుణాన్ని కూడా అందిస్తుంది. రానురాను మీ ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తగ్గుముఖం పడతాయి. విటమిన్ సీ సహజంగా చర్మాన్ని రిపెయిర్ చేస్తుంది. మన డైట్‌లో విటమిన్ సీ ఉంటే కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తారు.
వృద్ధాప్య ఛాయలకు చెక్..
ఉసిరికాయ మీ డైట్‌లో రెగ్యులర్‌గా ఉంటే వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు. అంతేకాదు ఇది చర్మానికి ఒక రక్షణ పొరగా ఉంటుంది. అయితే, కేవలం ఉసిరి ఒక్కటే సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు.
నల్లమచ్చలు..
విటమిన్ సీ ఉండే ఉత్పత్తులు సాధారణంగా ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. అంతేకాదు ముఖంపై ఉండే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కూడా ఈ విటమిన్‌తో తగ్గుతుంది. ఉసిరి సహజంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ సమస్యకు కూడా చెక్ పెడుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు..
కేవలం శరీర ఆరోగ్యం, చర్మం మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. విటమిన్ సీ మన శరీరం ఐరన్ గ్రహించేలా చేస్తుంది. ఈ విటమిన్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. కుదుళ్ల నుంచి బలంగా మారడంతోపాటు కొత్త వెంట్రుకలు కూడా పెరిగేలా చేస్తుంది.
Read Also: సూర్యరశ్మి సరిగ్గా అందట్లేదా? విటమిన్ D లోపాన్ని తగ్గించే అద్భుతమైన 5 ఆహారాలు ఇవే!
హెయిర్‌ఫాల్ తగ్గుతుంది..
హెయిర్‌ఫాల్ అనేది వివిధ కారణాల వల్ల జరుగుతుంది. అయితే విపరీతమైన స్ట్రెస్, హార్మోన్ల అసమతుల్యత, ఖనిజాల లేమి, థైరాయిడ్ డిజార్డర్, కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడటం కూడా కారణం కావచ్చు. ఉసిరికాయ జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది సహజంగా జుట్టు ఆరోగ్యానికి తోడ్పడి హెయిర్‌ఫాల్ సమస్యను తగ్గిస్తుంది.
కుదుళ్ల ఆరోగ్యం..
ఆరోగ్యకరమైన జుట్టుకు ఉసిరి తినండి. కుదుళ్ల ఆరోగ్య సమస్య ఉన్నవారు ఉసిరి తింటే మంచి మాయిశ్చర్ అందుతుంది. దీంతో కుదుళ్లు పొడిబారకుండా ఉంటాయి. తద్వారా చుండ్రు, కుదుళ్లకు ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఉసిరి ఉండే హెయిర్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల సహాజంగా మీ జుట్టు మెరుస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)