ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఫ్లోర్ చాలా నీట్‌గా ఉంటేనే ఇల్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే చాలామంది తెల్లని టైల్స్‌ను ఇష్టపడతారు, ఇవి ఆఫీసుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే తెల్లటి టైల్స్ కొంచెం నల్లగా మారితే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నలుపుదనాన్ని పోగొట్టడానికి కొందరు ఆసిడ్ ఉపయోగిస్తుంటారు, కానీ అలా చేయడం వల్ల టైల్స్ యొక్క గ్రౌడ్ పోతుంది. ఇది గ్యాప్స్‌లో రెండు టైల్స్ అటాచ్ చేయడానికి కలుపుతారు. దీనివల్ల నీళ్లు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి గ్రౌడ్ పోకుండా ఉండాలంటే యాసిడ్ వాడకూడదు. ఇంట్లోనే ఉండే రెండు వస్తువులతో ఈ నలుపుదనాన్ని సులభంగా వదిలించుకోవచ్చు, తద్వారా టైల్స్ మళ్లీ తెల్లగా మెరుస్తూ ఇల్లు అందంగా కనిపిస్తుంది.
ఇంట్లో ఉండే బేకింగ్ సోడాను ఉపయోగించడం సరిపోతుంది. ఒక పాత బ్రష్, కొంచెం నీరు, ఒక శుభ్రమైన గుడ్డను సిద్ధం చేసుకోండి. ముందుగా టైల్స్‌లో ఉన్న దుమ్ము ధూళిని తీసేసి, బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా తయారు చేసి గ్యాప్స్‌లో పూయండి. ఆ పేస్ట్ అక్కడ కాసేపు ఉన్న తర్వాత, పాత బట్టతో లేదా బ్రష్‌తో క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల టైల్స్ మధ్య ఉండే నలుపుదనం, దుమ్ము ధూళి అంతా పోయి గీతలు నీటుగా మారుతాయి. ఇవి ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి పెద్దగా ఖర్చు ఉండదు, పైగా గ్రౌడ్ కూడా పోదు.
సాధారణంగా మనం బేకింగ్ సోడాను కిచెన్ క్లీనింగ్ కోసం వాడుతుంటాము, కానీ టైల్స్ గ్యాప్స్లోని నలుపుదనాన్ని పోగొట్టడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఎలాంటి ఘాటైన వాసన లేకుండా, గ్రౌండ్ పోకుండా నిమిషాల్లో టైల్స్‌ను మెరిపిస్తుంది. దీని కోసం ఎక్కువ బలం ఉపయోగించి రుద్దాల్సిన అవసరం లేదు. కొందరు స్క్రబ్బర్స్ వాడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల గ్రౌండ్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేవలం బ్రష్‌తో మాత్రమే పేస్ట్ అప్లై చేస్తూ శుభ్రం చేసి, ఆ తర్వాత క్లాత్‌తో తుడిచేయండి. ఒకవేళ నలుపుదనం ఇంకా తగ్గకపోతే, వెనిగర్, నిమ్మరసం కలిపి కూడా ఇదే పద్ధతిలో ఉపయోగించవచ్చు. నిమ్మరసం బ్లీచింగ్ లాగా పనిచేసి నలుపుదనాన్ని వదిలించేస్తుంది. దీనిని మనం బాత్రూమ్ టైల్స్‌కు కూడా ఉపయోగించవచ్చు.