SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

కిస్మిస్ వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మన వంటగదిలో సులభంగా లభిస్తుంది. సాధారణంగా మనం స్వీట్లు తయారు చేసేటప్పుడు దీనిని ఉపయోగిస్తూ ఉంటాం, అయితే ఎముకల ఆరోగ్యం కోసం కిస్మిస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Written By Renuka Godugu
Published: Oct 19, 2026, 05:23 PM IST | Updated: Oct 19, 2026, 05:24 PM IST
Image Credit: Soaked Raisins Water On Empty Stomach:
Join

Soaked Raisins Water On Empty Stomach: రోజు నానబెట్టిన కిస్మిస్‌లను తిని, ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మనం రోజువారీ తీసుకునే డ్రై ఫ్రూట్స్ లాగే కిస్మిస్ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, శరీరానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈరోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కిస్మిస్ నీటిని తీసుకోవడం వల్ల శరీరారోగ్యంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ కిస్‌మిస్‌లను గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయాన్నే వాటిని తిని ఆ నీటిని తాగాలి. పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి, తద్వారా కాలేయం (లివర్) ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. నానబెట్టిన కిస్మిస్ తీసుకోవడం వల్ల ఉదయమే టాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కూడా కిస్మిస్ నీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు; ఇది కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, బి కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాకుండా, కిస్మిస్‌లో ఉండే కాల్షియం ఎముకల బలానికి ఎంతో అవసరం. పిల్లలు కూడా కిస్మిస్ తీసుకోవడం వల్ల వారి ఎముకలు దృఢంగా మారుతాయి. కిస్మిస్ తీసుకోవడం వల్ల హై బీపీ కూడా అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీని నియంత్రించాలన్నా ఈ కిస్మిస్ నీరు తీసుకోవాలి.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

ఉదయాన్నే పరగడుపున టీ లేదా కాఫీలకు బదులుగా ఇలాంటి కిస్మిస్ నీటిని తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. ఇది కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. కిస్మిస్ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని పేగులు శుభ్రపడతాయి, కాబట్టి మలబద్ధకం ఉన్నవారికి ఇది మంచి రెమెడీ. ఇందులో ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఈ కిస్మిస్ నీరు రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES