Published: Oct 23, 2026, 12:55 PM|Updated: Oct 23, 2026, 01:07 PM
Tibet Earthquake Deaths: చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో కనీసం 16 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారని అధికారులను ఉటంకిస్తూ అక్టోబర్ 23న వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదించింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతుండగా 12,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారి కోసం విస్తృత గాలింపు చేపట్టాలని, గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు.