ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని పూర్తిగా నివారించాలని, హింసాత్మక దృశ్యాలను చూపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. అలాగే, లైంగిక వేధింపుల బాధితుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని, కేవలం దేశ అధికారిక మ్యాప్‌లను మాత్రమే వాడాలని తెలిపింది. ఛానెళ్లలో జరిగే చర్చలు, ప్యానెల్ డిబేట్లు మతతత్వానికి లేదా దేశ వ్యతిరేక భావాలకు ప్రేరేపించేలా ఉండకూడదని పేర్కొంది. వార్తల ప్రసారాల్లో, గ్రాఫిక్స్, వర్చువల్ ప్రజెంటేషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రసారకర్తలకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. వార్తల ఖచ్చితత్వం, ప్రామాణికత, సున్నితత్వం దెబ్బతినకుండా చూసుకోవాలని, ఏఐ సాధనాలను కేవలం సహాయకారిగా మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. సాంకేతికత పేరుతో తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని