SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Adarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.. పబ్లిక్ టాక్ ఇదే..!

Adarsha Kutumbam Twitter Review and Public Talk: ఆదర్శ కుటుంబం మూవీతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేసేందుకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో వచ్చేసింది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు ఇప్పటికే ముగిశాయి. ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ మూవీ గురించ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నెటిజన్ల ఫస్ట్ రివ్యూలు, పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

Written By Ashok Krindinti
Published: Oct 30, 2026, 07:31 AM IST | Updated: Oct 30, 2026, 07:41 AM IST
Join

Adarsha Kutumbam Twitter Review and Public Talk: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. దసరా కంటే ముందుగా రావాల్సిన ఈ మూవీ వాయిదాల తరువాత ఎన్నో అంచనాల మధ్య నేడు (అక్టోబర్ 30న) థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. చాలా కాలంగా తరువాత వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుండడంతో మూవీ లవర్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తవడంతో సినిమాపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబంతో అదే జోరు కంటిన్యూ చేశారా..? గూరుజీ మ్యాజిక్ వర్కౌట్ అయిందా..? పబ్లిక్ టాక్ ఎలా ఉంది..? ఈ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..


"వెంకటేష్ మార్క్ వింటేజ్ చార్మ్.. సత్య హిలేరియస్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి హైలెట్. ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో రివీల్ అయ్యే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నా.. సాంగ్స్ మాత్రం నిరాశకు గురి చేస్తాయి. అయితే స్టోరీ అక్కడక్కడా ఊహకందేలా సాగడం.. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉండటం కాస్త మైనస్ అయింది. క్రిస్ప్ రన్‌టైమ్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆకాశాన్ని తాకే అద్భుతమైన కథ కాకపోయినా.. ఎలాంటి బోర్ కొట్టకుండా సరదాగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ డీసెంట్ ఎంటర్‌టైనర్.." ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

 


"ఆదర్శ కుటుంబం సినిమాకు ఫస్ట్ షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ మొదలైంది. ఫస్టాఫ్ ఆద్యంతం అలరిస్తూ రైట్ నోట్స్‌ను టచ్ చేయడమే కాకుండా.. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. గురూజీ-వెంకీ కాంబో అంటేనే ఆ మ్యాజిక్ వేరు.. ఆ వింటేజ్ ఫ్యామిలీ హ్యూమర్, అదిరిపోయే డైలాగ్స్ తో మరోసారి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై భారీ అంచనాలు నెలకొంటాయి.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.." అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.

 


వెంకీ అనే రివ్యూయర్ మాత్రం అక్కడక్కడా నవ్వించినా.. కథనం మాత్రం సరైన రిథమ్‌ను అందుకోలేకపోయిందని రాసుకొచ్చారు. "ఫస్టాఫ్‌లో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా.. కామెడీతో సాఫీగానే సాగిపోతూ చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. అయితే ఆ సెటప్‌ను సరిగ్గా వాడుకోలేదు. దీంతో సెకండాఫ్ బాగా సాగదీతగా అనిపిస్తుంది. కామెడీ కొన్నిచోట్ల పండినా.. మరికొన్ని సన్నివేశాల్లో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. మ్యూజిక్ కూడా నిరాశపరుస్తుంది. వెంకటేష్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. సెకండాఫ్ లో కథనం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. మొత్తంగా చూస్తే ఇది బిలో యావరేజ్ నుంచి యావరేజ్ మధ్యలో నిలిచే మూవీ.." అని రివ్యూ ఇచ్చారు.

 

 

"త్రివిక్రమ్ మార్క్ రైటింగ్, వెంకీ మామ వింటేజ్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షోతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. తమన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. హీరోయిన్ల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ముఖ్యంగా థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ లభిస్తోంది." అని మరొకరు రివ్యూ ఇచ్చారు. ట్విట్టర్ లో పాజిటివ్ అంశాలతో పాటు అన్ని రకాల అభిప్రాయాలూ కనిపిస్తున్నాయి. జీ తెలుగుల న్యూస్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫైనల్ రివ్యూ మరికాసేపట్లో రానుంది. 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES