• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘కిల్లర్’ మూవీ రివ్యూ .. ఎలా ఉందంటే..!!

‘కిల్లర్’ మూవీ రివ్యూ .. ఎలా ఉందంటే..!!

Killer Telugu Movie Review: జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిల్లర్’. సైంటిఫిక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అంతేకాదు ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ ఇంటర్వెల్‌లో గెస్ చేస్తే కోటి రూపాయల బహుమతి అని ప్రకటించారు. మొత్తంగా కోటి రూపాయల బహుమతి పేరుతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ఎంగేజ్ చేసేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 30, 2026, 12:47 AM IST|Updated: Oct 30, 2026, 01:51 PM IST
joinshare
‘కిల్లర్’ మూవీ రివ్యూ .. ఎలా ఉందంటే..!!
Image Credit: Killer Movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttarakhand Chopper Crash:  ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు.. వీడియో వైరల్..

2

పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

3

Rangareddy: మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

4

YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

5

మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

‘కిల్లర్’ మూవీ టైటిల్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దీంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో .. అంతకు మించి దుష్బ్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతి పూర్వజ్ కు సంబంధించిన క్యారెక్టర్ యాక్సిడెంట్‌కు గురవుతుంది. అంతేకాదు ఆమె మెదడుకు వెళ్లే సంకేతాలు దెబ్బ తింటాయి. ఇక ఆమె గతాన్ని   కొంత మంది వ్యక్తులు ఆమె గురించిచెబుతూ ఉంటారు. ఒక్కో వ్యక్తి ఆమెను  రకరకాలు పేర్లతో ఆమె బిహేవియర్ గురించి చెబుతూ ఉంటారు. ఒకరేమో ఆమె ఉగ్రవాది రానియా అని.. మరొకరు దెయ్యం రక్తిక అని.. సియా అని ఆమె గురించి చెబుతూ ఉంటారు. ఇలా విభిన్న వ్యక్తిత్వాలతో ఐడెంటీ వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి..? ఈమెకు సైంటిస్ట్ పూర్వజ్ క్యారెక్టర్‌తో ఉన్న రిలేషన్ ఏంటి?  అసలు జ్యోతి పూర్వజ్ నిజమైన ఐడెండిటీ ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 
దర్శకుడు పూర్వాజ్ ఈ కథను మన దేశంలో నీలగిరి ప్రాంతంలో అంతరిక్షం నుంచి ఓ ఉల్క పడుతుంది. దానిలోని ఓ భాగాన్ని దర్శకుడు కమ్ నటుడు పూర్వాజ్ కు దొరుకుతుంది. మొత్తంగా ఈ సినిమాలో ఏఐ సాంకేతికతో మనిషి మెదడులో చిప్‌ను చొప్పించి మానవ మెదడు ఎలా పనిచేస్తుందనే అంశాన్ని ప్రస్తావించారు. ఓ రకంగా ‘ఇస్మార్ట్ శంకర్’ అదే అంశంతో తెరకెక్కినా.. ఈ సినిమా మాత్రం పూర్తిగా కొత్తతరహాలో సాగడం విశేషం.  సినిమాలో శాస్త్రవేత్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనే పాయింట్ లాజిక్‌కు అందదు. ఓ సైంటిస్ట్ పోలీస్ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఎక్కడా ఉండదు.   మరోవైపు  కథానాయిక జ్యోతి పూర్వజ్ కు సంబంధించిన ఒక్కొకరికి ఒక్కోలా కనిపిస్తుంది. అసలు ఆమె టెర్రరిస్టా, దెయ్యామా, లేకపోతే అనే అంశం బాగున్నా.. దాన్ని మెప్పించే రీతిలో చెప్పలేకపోయాడు. క్యారెక్టర్స్ మధ్య కనెక్టివిటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా.. అదే స్థాయిలో కంటిన్యూ చేయడంలో  తడపడ్డాడు. సెకాండాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టర్ రకరకాలుగా కనిపించడానికి గల కారణాలు కనిపిస్తాయి. కానీ కన్విన్సింగ్‌గా కనిపించదు. క్లైమాక్స్‌లో హడావుడిగా ముగించినట్టు ఉంది. దర్శకుడు , హీరో చెప్పి కోటి రూపాయల ట్విస్ట్ పెద్దగా మెప్పించలేకపోయింది.

నటీనటుల విషయానికొస్తే..

జ్యోతి పూర్వజ్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు. పూర్వజ్ శాస్త్రవేత్తగా యాక్ట్ చేశారు.  విభిన్న తరహా పాత్రల్లో కనిపించి నటిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు.  అయితే శాస్త్రవేత్త పాత్రలో వేరే హీరోలకు సంబంధించిన షేడ్స్ కనపడ్డాయి.అయితే కథలో ఎక్కువగా కథానాయిక పాత్రకే ప్రాధాన్యత దక్కింది. మిగిలిన నటీనటులకు పెద్దగా నటించే అవకాశమే రాలేదు.

పంచ్ లైన్.. అక్కడక్కడ థ్రిల్ చేసే ‘కిల్లర్’..

రేటింగ్: 2.5/5

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Movie Review
OTT Movies