రజినీకాంత్ ‘జైలర్ 2’ రివ్యూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసాలా..!!
Jailer 2 Review: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు 70 దాటినా.. పడుచు హీరోలకు ధీటుగా తన సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు ఈ ఏజ్లో కూడా వయసుకు తగ్గ క్యారెక్టర్స్తో బాక్సాఫీస్ తుక్కు ఒదిలిస్తున్నాడు. మరికొన్ని గంటల్లో ‘జైలర్ 2’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. జైలర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాతో రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా లేదా చేద్దాం.
Jaier 2 First Review: రజినీకాంత్ ‘జైలర్’ మూవీకి సీక్వెల్గా ‘జైలర్ 2’ మూవీతో పలకరించబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో ఒకేసారి ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారు. మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండ్యన్’గా ఇరగదీయడానికి వస్తున్నాడు. మరోవైపు కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఒక్క తమిళంలో తప్ప తెలుగు, హిందీలో పెద్దగా బుకింగ్స్ లేవు. ఓ రకంగా ‘జైలర్ 2’ విడుదలైన తర్వాత ‘జైలర్’ సినిమాలానే ఉందనే కామెంట్స్ వినిపించాయి. కేవలం కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మారాయనే కామెంట్స్ వినిపించాయి.
జైలర్ 2 పగ ప్రతీకారం..
ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘జైలర్ 2’ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా తన ఫ్యామిలీకి, సొసైటీకి ద్రోహం చేసిన వారిని ఎలా మట్టుపెట్టానేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక తమిళంలో మంచి జోరుమీదున్న ఈ సినిమాకు తెలుగులో టాక్ను బట్టి ఈ సినిమా పుంజుకునే అవకాశాలున్నాయి.
జైలర్ 2లో అదిరిపోయిన హృతిక్ రోషన్ క్యారెక్టర్ ..
కొన్ని బ్లడ్ బాత్ సీన్స్ ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A +16 సర్టిఫికేట్ జారీ చేసారు. టైగర్కా హుకుం అన్నట్టుగా ‘జైలర్ 2’లో జైళ్లకు సంబంధించిన కొన్ని సీన్స్ హైలెట్గా నిలవనున్నాయి. మిథున్ చక్రబర్తి క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్గా ఉండబోతున్నట్టు సమాచారం. . ‘జైలర్’ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కెమియోలు మరోసారి స్పెషల్గా నిలవనున్నట్టు చెబుతున్నారు.
ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో రమ్యకృష్ణ, విద్యాబాలన్, మిర్నా, సూరజ్ వెంజారమూడు పాత్రల ఇంపాక్ట్ బాగుందట. ఇక తెలుగులో ‘జైలర్ 2’ దాదాపు రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి.