SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగం వేటలో ఉన్నవారికి శుభవార్త.. డిగ్రీ ఉంటే చాలు మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 46, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 791 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు భర్తీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 05, 2026, 09:34 AM IST | Updated: Nov 05, 2026, 09:38 AM IST
Image Credit: BOB Recruitment 2026: File
Join

BOB Recruitment 2026: డిగ్రీ పూర్తి చేసిన వారికి భారీ గుడ్‌న్యూస్‌.. బ్యాంకు జాబ్‌ చేయాలని ఎదురు చూస్తున్నవారికి బంపర్‌ శుభవార్త. మొత్తం 837 పోస్టుల భర్తీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 46 అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, 791 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు భర్తీ చేయనుంది. 2026 నవంబర్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేయాలంటే bankofbaroda.bank.in/career/current opportunities లో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ, ఎంబీఏ అర్హత ఉండాలి. అంతేకాదు పోస్టులకు సంబంధించి ఉద్యోగం అనుభవం ఉండాలి.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏవీపీ II, ఏవీపీ I, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల దరఖాస్తు స్వీకరణ నిన్నటి నుంచి మొదలైంది. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్‌ ఫీజు..
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దరఖాస్తు చేసుకోవాలంటే యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, ఉమెన్‌కు కేవలం రూ.175 జీఎస్టీతో కలిపి చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ..
ఏవీపీ II, ఏవీపీ I, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అప్లికేషన్‌ క్షుణ్నంగా పరిశీలిస్తారు. మొదట ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.

వయో పరిమితి..
గ్రూప్‌ హెడ్‌.. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ II డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి పట్టా పొంది ఉండాలి. 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. హెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. టెర్రిటరీ హెడ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ I దరఖాస్తు చేసుకునేవారు 28-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ I పోస్టుకు 26-45 మధ్య ఉండాలి. సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, డిప్యూట మేనేజర్‌ 24-35 మధ్య ఉండాలి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నోటిఫికేషన్‌ 2026 వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక నోటిఫికేషన్‌ పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి.

Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

Read Also: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES