Bank Jobs 2026: గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ బ్యాంక్‌లో 1500 పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇదే!
గ్రాడ్యూయేట్లకు ఇండియన్ బ్యాంక్ భారీ నుంచి భారీ గుడ్‌న్యూస్.. కొత్తగా డిగ్రీ పట్టా పొందిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Indian Bank Apprentice Recruitment 2026: బ్యాంక్ జాబ్ కొట్టాలని చాలామంది కలలు కంటారు. అందులో కొత్తగా డిగ్రీ పట్టా పొందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి 1500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అప్రెంటిస్ యాక్ట్ 1961 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈరోజు నవంబర్ 5, 2026వ తేదీ నుంచి కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి 20-28 మధ్య ఉన్నవారు, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన వారు అధికారిక వెబ్‌సైట్ www.indianbank.bank.in లో నోటిఫికేషన్ పీడీఎఫ్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఖాళీలకు సంబంధించిన అర్హత పూర్తి వివరాలు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ..
ఈ ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తప్పనిసరి. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫెండ్ 12 నెలల ట్రైనింగ్ సమయంలో రూ.12,300-15000 అందిస్తారు. ఇది ఆయా బ్యాంచ్ లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ ఈరోజు నుంచి మొదలైంది నవంబర్ 25వ తేదీ చివరి రోజు. ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీల విషయానికి వస్తే మొత్తం 1500 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారీగా భర్తీ చేస్తారు. తమిళనాడుకు ఎక్కువ ఖాళీలు 270, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 285 పోస్టులు కేటాయించారు.
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అర్హత..
డిగ్రీ లేదా తత్సమానం గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పట్టా పొందిన వారు అర్హులు. వయోపరిమితి విషయానికి వస్తే కనిష్టంగా 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఇక ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఏళ్ల వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఓబీసీ 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ 10 ఏళ్లు, 1984 అల్లర్లలో ప్రభావితం అయినవారికి 5 ఏళ్లు, డివొర్సీ ఉమెన్, వితంతువులకు జనరల్ 35 ఏళ్ల వరకు, ఓబీసీ 38 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ వారికి 40 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర కండిషన్స్ ఏంటంటే?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇది వరకు ఇతర బ్యాంకుల్లో అప్రెంటిస్ చేసి ఉండకూడదు. ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నావారు కూడా అనర్హులు. ఇతర సంస్థల్లో శిక్షణ సమయంలో అనర్హులు అయినవారు కూడా దరఖాస్తు చేయకూడదు. ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగ ఎక్స్‌సర్వీస్‌మెన్‌లు కూడా ఈ అప్రెంటిస్‌షిప్‌కు అనర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌వారు రూ.800 తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ.175 తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!
Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
ఎంపిక విధానం..
మొదట ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ పరీక్షలో పాసైనవారికి లాంగ్వెస్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చదవడం, రాయడం, మాట్లాడటంపై పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 100 మార్కులకు మొత్తం 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ అప్రెంటిస్ విజయవంతంగా పూర్తి చేసినవారికి బోర్డ్ ఆఫ్ ట్రైనింగ్ డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ (COP) జారీ చేస్తారు. NATS2.0 నుంచి అభ్యర్థులు సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.