SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బాలీవుడ్‌లో మళ్లీ వణుకు..టైగర్ ష్రాఫ్‌పై దాడికి నెల ముందే స్కెచ్.. ప్రముఖుల ఇళ్ల వద్ద షూటర్ల రెక్కీ! పోలీసుల వద్ద విశ్వసనీయ సమాచారం!

టైగర్ ష్రాఫ్‌ కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల వద్ద అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఉంది. అసలు లక్ష్యం టైగర్ ష్రాఫ్‌ మాత్రమే కాదా?, మొత్తం బాలీవుడ్ అని ఈ సమాచారంతో స్పష్టమవుతోంది. ముంబైలో సెలబ్రిటీల ఇళ్ల వద్ద దాడికి ముందే షూటర్లు నెలరోజులుగా రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 21, 2026, 09:20 AM IST | Updated: Oct 21, 2026, 09:34 AM IST
Image Credit: Tiger shroff firing news:
Join

Tiger shroff firing news: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే, టైగర్ ష్రాఫ్‌ దాడికి నెల రోజుల ముందే షూటర్లు ముంబైకి వచ్చినట్లు పోలీసుల వద్ద ఉన్న సమాచారం. అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్‌ మాత్రమే కాదు, మొత్తం బాలీవుడ్ అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. షూటర్లు దాడికి నెల రోజుల ముందు నుంచే ముంబైలోని ప్రముఖ సెలబ్రిటీల ఇళ్ల వద్ద రెక్కీ వేశారని పోలీసులకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అందింది. దీని కోసం వారు ఒక ఆటో రిక్షా డ్రైవర్‌ను నమ్మించి, సెలబ్రిటీల ఇళ్లను చూడాలని అక్కడ ఫోటోలు తీసుకోవాలనుందని అడిగారు. దీంతో ఆ ఆటో డ్రైవర్‌ మొదట అమితాబ్ బచ్చన్, అమీర్‌ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల ఇళ్లకు తీసుకెళ్లారు. ముంబైలో చాలామంది టూరిస్టులు సెలబ్రిటీల ఇళ్లను చూడటానికి, అక్కడ ఫోటో తీసుకోవాలని వెళ్తారు. ఇదే ప్లాన్‌ను షూటర్లు కూడా అమలు చేశారు. ఆటో డ్రైవర్‌ను నమ్మించి అక్కడికి తీసుకు వెళ్లారు.

ముగ్గురు అనుమానితులు అరెస్ట్..

అక్కడ భారీ బందోబస్తు ఉండటంతో తక్కువ భద్రత ఉన్న సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవాలని షూటర్లకు సూచనలు అందాయట. దీంతో ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ ఆడటానికి మైదానానికి వెళ్లిన టైగర్ ష్రాఫ్‌ వస్తాడని అతనికి సెక్యూరిటీ తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. దీంతో షూటర్లు వెంటనే అక్టోబర్‌ 11వ తేదీ జూహులోని మైదానానికి వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడి నుంచి టైగర్‌ వెళ్లిపోయారు. దీంతో మళ్లీ 18వ తేదీ కూడా టైగర్‌ ష్రాఫ్‌ కోసం అదే మైదానానికి వెళ్లారు. ఇదే సమయంలో హరియాణా నుంచి మరికొందరు షూటర్లు ముంబైకి వచ్చి రెక్కీ చేయడం ప్రారంభించారు. ఇక ఆదివారం టైగర్ ష్రాఫ్‌ గేట్‌ వద్దకు రాగానే అతనిపై దాడి చేసిన తర్వాత, నిందితులు ముంబై నుండి వెళ్ళిపోయే సమయంలో రెండు ఆయుధాలను గుర్తు తెలియని ప్రదేశంలో పడేశారు. ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం ముంబై పోలీసులకు సవాలుగా మారింది. నిందితుల వద్ద ఒక పిస్టల్, మరొక విదేశీ పిస్టల్ ఉన్నట్లు సమాచారం, ఆ పిస్టల్ ఎక్కడి నుండి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్‌లోని కోటాలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు లక్ష్యం టైగర్ ష్రాఫ్ కాదని, సల్మాన్ ఖాన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తోందనే విషయం తెలిసిందే..

 

 

ఆదివారం ఏం జరిగింది?
ఆదివారం సాయంత్రం టైగర్ షాఫ్ కారుపై కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు మొదట బాంద్రా బ్యాండ్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటికి రెక్కీ వేశారు. కానీ అక్కడ భారీ భద్రత ఉండటంతో వెంటనే తమ ప్లాన్ మార్చుకుని, తక్కువ సెక్యూరిటీ ఉన్న టైగర్ షాఫ్ కోసం వెతికారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన అమిత్ పండిట్ రెక్కీ వేసి, టైగర్ ష్రాఫ్‌ గేటు నుంచి బయటకు రాగానే కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, సెలబ్రిటీల ఇళ్ల వద్ద రెక్కీ జరగడం వీళ్లు పూర్తిగా బాలీవుడ్‌నే టార్గెట్‌ చేశాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read Also: బాగా అలసిపోయా.. కొన్ని రోజులు వియత్నాం వెళ్లొస్తా! రాహుల్‌ గాంధీ ఫ్లైట్‌ వీడియోపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు! కాంగ్రెస్‌ కౌంటర్‌ ఏంటంటే?
 

సల్మాన్ ఖాన్, బిష్ణోయ్‌ గ్యాంగ్ మధ్య వివాదం:
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బిష్ణోయ్‌ గ్యాంగ్ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 1998లో జోధ్‌పూర్‌లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనను రాజస్థాన్‌లోని బిష్ణోయ్‌ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది, ఎందుకంటే వారు కృష్ణ జింకను పవిత్రంగా భావిస్తారు. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ వారికి టార్గెట్ అయ్యారు. గతంలో కూడా ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES