అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కమర్షియల్ స్టాళ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని విశాఖపట్నం గాజువాకలోని వినాయక మండపం వద్ద పోలీసులు గుర్తించారు. వెంటనే అనుమతులు లేని ఆ స్టాళ్లను, యమలోకం సెట్‌ను తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. అయితే, నిర్వాహకులు అందుకు అంగీకరించకపోవడంతో అధికారులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం పెరిగింది. వినాయక విగ్రహ దర్శనాన్ని పూర్తిగా ఉచితంగానే నిర్వహించాలని, ఏ పరిస్థితిలోనూ స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై స్పష్టమైన నివేదిక సిద్ధం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతూ అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. గాజువాక గణపతి దర్శనం కోసం నిర్వాహకులు రూ.100, యమలోకం సెట్టు