• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /EHS వర్తింపుపై మహిళా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి.. ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్..!!

EHS వర్తింపుపై మహిళా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి.. ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్..!!

EHS Scheme: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Written ByBhoomi
Published: Nov 20, 2026, 09:23 IST|Updated: Nov 20, 2026, 09:26 IST
joinshare
EHS వర్తింపుపై మహిళా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి.. ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్..!!
Image Credit: EHS Scheme:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

EHS Scheme: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరింత ఉదారంగా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారం.. మహిళా ఉద్యోగులు కేవలం తమ తల్లిదండ్రులను మాత్రమే కుటుంబ సభ్యులుగా చేర్చుకునే వైద్య సదుపాయం పొందే ఛాన్స్ ఉంది.


తమ అత్తమామలను చేర్చుకునే అవకాశం లేదు. వివాహం తర్వాత చాలా మంది మహిళా ఉద్యోగులు తమ భర్త కుటుంబంతోనే నివసిస్తూ.. అత్తమామల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు మహిళా ఉద్యోగులకు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలు.. ఈ రెండు జంటల్లో ఏదొక జంటను ఈహెచ్ఎస్ పరిధిలో చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్లో ఏదొక జంటను ఎంచుకనే ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం.. మహిళా ఉద్యోగుల విషయంలో అదే ఉదారతను చూపాల్సిన అవసరం ఉందంటున్నారు.

వారి పట్ల సర్కార్  ప్రత్యేక దృష్టి:

కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన మహిళా ఉద్యోగుల విషయంలో సర్కార్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో సంపాదించే ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణం చెందితే, ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ భార్యకు కారుణ్య నియామకం కల్పిస్తారు. దాంతో ఆ ఇంటి బాధ్యతలన్నీ ఆమె భుజాలపైనే పడతాయి. మరీ ముఖ్యంగా, వయసు పైబడిన అత్తమామలు ఆర్థికంగానే కాకుండా, వైద్యపరంగా కూడా కోడలిపైనే ఆధారపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

కుటుంబాన్ని చూసుకుంటున్న మహిళా ఉద్యోగులు: 

భర్త లేని లోటును తట్టుకుని, కుటుంబానికి అండగా నిలుస్తూ, అత్తమామలను చూసుకుంటున్న మహిళా ఉద్యోగులకు.. వారిని EHS పథకంలో చేర్చుకునే వెసులుబాటు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కొడుకు ఉద్యోగంలో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులకు దక్కే ఆరోగ్య భరోసా.. అతను మరణించిన తర్వాత భార్యకు కారుణ్య నియామకం లభించినప్పుడు ఎందుకు నిలిచిపోవాలి? కుటుంబాన్ని నడిపిస్తున్న ఆ మహిళకు అత్తమామల వైద్య అవసరాలు తీర్చే అవకాశం కల్పించడం న్యాయమే కదా.

EHS నిబంధనలను మార్చాలి: 

మహిళా ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్ల విషయంలో EHS నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది. తమ కన్న తల్లిదండ్రులు లేదా భర్త తల్లిదండ్రులు.. వీరిలో ఎవరిని చేర్చుకోవాలనేది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళా ఉద్యోగులకే ఇవ్వాలి. ఏదో ఒక జంటను మాత్రమే ఎంచుకునే అవకాశం ఇస్తే, అది ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం కాబోదు. పైగా, కుటుంబ బాధ్యతలను మోస్తున్న మహిళలకు ఇది ఒక పెద్ద తోడ్పాటుగా నిలుస్తుంది.

ఈ మార్పును ప్రభుత్వం ఆచరణలో పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు పెద్ద మేలు జరుగుతుంది. తల్లిదండ్రులు లేదా అత్తమామలలో ఏదో ఒక్క జంటకే వర్తింపు ఉంటుంది కాబట్టి, ఆర్థికంగా ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సానుభూతితో, మానవీయ దృక్పథంతో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.

Also Read: 

సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Employees
govt schools
Revanth Reddy