• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ సేకరించండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!

విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ సేకరించండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!

Revanth Reddy School Uniforms Review: రాష్ట్రంలోని సర్కారు బడులు, రెసిడెన్షియల్ స్కూల్స్, పలు సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్స్ విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్స్ గురించి వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Written ByBhoomi
Published: Nov 05, 2026, 10:17 AM IST|Updated: Nov 05, 2026, 10:19 AM IST
joinshare
విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ సేకరించండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!
Image Credit: Revanth Reddy School Uniforms Review:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth Reddy School Uniforms Review: రాష్ట్రంలోని సర్కారు బడులు, రెసిడెన్షియల్ స్కూల్స్, పలు సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్స్ విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్స్ గురించి వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నాడు జరిగిన సమీక్షలో విద్యార్థులకు యూనిఫామ్స్, కిట్ల పంపిణీ తీరుపై ముఖ్యమంత్రి చర్చించారు. గతం కంటే ఎంతో నాణ్యమైన వస్త్రాలు, ఆకట్టుకునే రంగులు, ఆధునిక డిజైన్లతో యూనిఫామ్స్ అందించినట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

అయితే ఆయా రంగులు, డిజైన్లకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలని సీఎం చెప్పారు. అలా చేస్తేనే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగుల డిజైన్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం ఇవ్వవచ్చని సీఎం అన్నారు. యూనిఫామ్స్ తో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తి  అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఒకటి రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95శాతం వరకు పూర్తైనట్లు తెలిపారు. ఆ వస్తువుల పంపిణీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇక వచ్చే ఏడాది విద్యార్థులకు అందించే యూనిఫామ్స్, ఇతర సామాగ్రికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు అందించే వస్తువుల జాబితా రూపకల్పన, టెండర్లు, సరఫరా, అందజేత వరకు ప్రతీది కూడా నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని తెలిపారు. స్కూల్స్ తెరిచిన రోజే మొత్తం వస్తువులు అందే విధంగా ఇప్పటి నుంచే కార్యచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఎంపీ వేం నరేంద్ర రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, రాష్ట్ర గిరిజన, వెనకబడిన తరగతుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బుజ్జా, పలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: 

పీఆర్సీ, హెల్త్ కార్డులు, 5 రోజుల పనిదినాలు.. రేవంత్ సర్కార్‌కు ఉద్యోగుల వినతి..!!

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Telangana News
Telugu News