విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ సేకరించండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!
Revanth Reddy School Uniforms Review: రాష్ట్రంలోని సర్కారు బడులు, రెసిడెన్షియల్ స్కూల్స్, పలు సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్స్ విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్స్ గురించి వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Revanth Reddy School Uniforms Review: రాష్ట్రంలోని సర్కారు బడులు, రెసిడెన్షియల్ స్కూల్స్, పలు సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్స్ విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్స్ గురించి వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నాడు జరిగిన సమీక్షలో విద్యార్థులకు యూనిఫామ్స్, కిట్ల పంపిణీ తీరుపై ముఖ్యమంత్రి చర్చించారు. గతం కంటే ఎంతో నాణ్యమైన వస్త్రాలు, ఆకట్టుకునే రంగులు, ఆధునిక డిజైన్లతో యూనిఫామ్స్ అందించినట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.
అయితే ఆయా రంగులు, డిజైన్లకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలని సీఎం చెప్పారు. అలా చేస్తేనే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగుల డిజైన్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం ఇవ్వవచ్చని సీఎం అన్నారు. యూనిఫామ్స్ తో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తి అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఒకటి రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95శాతం వరకు పూర్తైనట్లు తెలిపారు. ఆ వస్తువుల పంపిణీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇక వచ్చే ఏడాది విద్యార్థులకు అందించే యూనిఫామ్స్, ఇతర సామాగ్రికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు అందించే వస్తువుల జాబితా రూపకల్పన, టెండర్లు, సరఫరా, అందజేత వరకు ప్రతీది కూడా నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని తెలిపారు. స్కూల్స్ తెరిచిన రోజే మొత్తం వస్తువులు అందే విధంగా ఇప్పటి నుంచే కార్యచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఎంపీ వేం నరేంద్ర రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, రాష్ట్ర గిరిజన, వెనకబడిన తరగతుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బుజ్జా, పలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
పీఆర్సీ, హెల్త్ కార్డులు, 5 రోజుల పనిదినాలు.. రేవంత్ సర్కార్‌కు ఉద్యోగుల వినతి..!!
వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!