• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana Politics: తెలంగాణ రాజకీయాలు @వ్యక్తిగత దూషణలు..అధికార, విపక్షాల తీరుపై సూటి ప్రశ్న!

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు @వ్యక్తిగత దూషణలు..అధికార, విపక్షాల తీరుపై సూటి ప్రశ్న!

Telangana Political News: జీ తెలుగు న్యూస్ నిర్వహించిన 'బిగ్ డిబేట్ విత్ భరత్' కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, రాజకీయ శైలిపై ఎడిటర్ శ్రీ భరత్ లోతైన విశ్లేషణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు వ్యక్తిగత దూషణల కంటే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే రాజకీయాలు నడపాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం పరస్పర నియోజకవర్గాలపై సవాళ్లు విసురుకోవడం కంటే ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ స్పష్టం చేశారు.

Written ByHarish Darla
Published: Oct 02, 2026, 09:16 AM IST|Updated: Oct 02, 2026, 12:56 PM IST
joinshare
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు @వ్యక్తిగత దూషణలు..అధికార, విపక్షాల తీరుపై సూటి ప్రశ్న!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

2

Jason Sanjay: దళపతి విజయ్‌కి, అమ్మ సంగీతకి ఉన్న తేడా చెప్పిన జాసన్ సంజయ్

3

OnePlus ఫోన్లపై రూ.24,000 వరకు భారీ డిస్కౌంట్.. త్వరలోనే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

4

Adoni New District Demand: ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పోరాటం.. పల్లెపల్లెనా ఉద్యమ పోరు..!

5

లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Political News: ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో నాయకులు పరస్పరం చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలను ఉద్దేశించి 'ప్లేట్లు కడిగేవాళ్లు, బాత్‌రూమ్‌లు కడిగేవాళ్లు' అని మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి తగదని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర పదజాలాన్ని ఉపయోగించినప్పటికీ, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక తన భాషను తగ్గించుకుని పరిణతితో వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య రాజకీయం ప్రధానంగా అభివృద్ధి అంశాల చుట్టూనే సాగుతోందని, అయితే తెలుగు రాష్ట్రాల్లో నేతలు వ్యక్తిగత విషయాలపై ఎక్కువ వెళ్తున్నారని ఎడిటర్ శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడితే జనం మెచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చాక సాధించిన పురోగతిని సభల్లో వివరించడమే ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.

పరస్పర ఆరోపణలు ప్రజలకు చేటే..
ఇటీవల సిరిసిల్ల సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తాను సిరిసిల్ల, సిద్దిపేటలోనూ గెలుస్తామనే సందేశం ఇవ్వాలని భావించినప్పటికీ, పక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరికి రూ. 500 ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోయే ప్రసక్తే లేదని శ్రీ భరత్ విశ్లేషించారు. గతంలో ఏపీలో 'వై నాట్ కుప్పం' అన్న జగన్ సొంత జిల్లాలోనే దెబ్బతిన్న విషయం ఆయన గుర్తుచేశారు.

అదే విధంగా కేసీఆర్ గజ్వేల్‌ను, హరీష్ రావు సిద్దిపేటను, కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి చేసినట్లే, రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నాయకులు వ్యక్తిగత దూషణలు పక్కనపెట్టి అభివృద్ధి పోటీపైనే దృష్టి సారించాలని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
KTR
Telugu News