SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

క్యాప్సికమ్ పాడైపోయిందో లేదో క్షణాల్లో గుర్తుపట్టండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్ స్టోరేజ్ టిప్స్!

కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మనం ఫ్రిడ్జ్‌లో భద్రపరుస్తుంటాము. క్యాప్సికం కూడా చాలామందికి ఇష్టమైన కూరగాయ, ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. వీటిని సలాడ్లలో కూడా వాడుతుంటారు, అయితే ఆకుపచ్చ రంగు క్యాప్సికమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎరుపు , పసుపు రంగు క్యాప్సికమ్స్‌లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మన ఇళ్లలో ఎక్కువగా గ్రీన్ క్యాప్సికం వాడుతుంటాము కాబట్టి, దీన్ని ఎలా నిల్వ చేయాలి? ఎన్ని రోజులకు పాడవుతుంది మరియు ఎలా గుర్తించాలి?

Written By Renuka Godugu
Published: Oct 14, 2026, 12:01 PM IST | Updated: Oct 14, 2026, 12:08 PM IST
Image Credit: How to store capsicum long time
Join

కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మనం ఫ్రిడ్జ్‌లో భద్రపరుస్తుంటాము. క్యాప్సికం కూడా చాలామందికి ఇష్టమైన కూరగాయ, ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. వీటిని సలాడ్లలో కూడా వాడుతుంటారు, అయితే ఆకుపచ్చ రంగు క్యాప్సికమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎరుపు , పసుపు రంగు క్యాప్సికమ్స్‌లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మన ఇళ్లలో ఎక్కువగా గ్రీన్ క్యాప్సికం వాడుతుంటాము కాబట్టి, దీన్ని ఎలా నిల్వ చేయాలి? ఎన్ని రోజులకు పాడవుతుంది మరియు ఎలా గుర్తించాలి?

పాడైన క్యాప్సికం లక్షణాలు:
- క్యాప్సికం పాడైతే దాని పై పొర మెత్తగా లేదా జిగటగా అనిపించవచ్చు, అంటే అది లోపలి నుండి పాడవుతోందని అర్థం.
- క్యాప్సికం పైన తెల్లటి బూజు కనిపిస్తే అది పాడైపోయిందని అర్థం.
- క్యాప్సికం మరీ మృదువుగా మారి, అక్కడక్కడ గీతలు కనిపిస్తే దానిని వాడకూడదు.
- క్యాప్సికం యొక్క కాడ వద్ద బ్రౌన్ లేదా బ్లాక్ మచ్చలు కనిపిస్తే అది పాడైందని గుర్తించాలి.

క్యాప్సికం నిల్వ చేసే విధానం..
క్యాప్సికమ్‌ను సరిగ్గా స్టోర్ చేస్తే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అయితే, స్టోర్ చేసే ముందు క్యాప్సికమ్‌ను కడగకూడదు. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్‌లో ఉంచాలనుకుంటే, కడిగిన తర్వాత బాగా తుడవాలి; తేమ ఉంటే పాడయ్యే అవకాశం ఉంది. కూరగాయలు తాజాగా ఉండటానికి ఫ్రిడ్జ్‌లోని డ్రాయర్లలో మాత్రమే వీటిని నిల్వ చేయండి, ఎందుకంటే అక్కడ తేమ స్థాయి తక్కువగా ఉంటుంది.
ఫ్రిడ్జ్‌లో ఉంచే ముందు, క్యాప్సికమ్‌ను ఒక పేపర్ టవల్‌లో చుట్టి ఉంచితే, అది అదనపు తేమను పీల్చుకుంటుంది. అప్పుడు మీరు దీన్ని నిల్వ చేయవచ్చు. క్యాప్సికమ్‌ను నేరుగా కాకుండా మెష్ బ్యాగుల్లో ఉంచితే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది మరియు తేమ పట్టదు. అలాగే, క్యాప్సికమ్‌ను కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉంచడం మంచిది

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!
 

మనం ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ రైస్ చేసేటప్పుడు క్యాప్సికమ్‌ను కొద్ది మొత్తంలో వాడుతుంటాము. కట్ చేసిన మిగిలిపోయిన క్యాప్సికమ్‌ను ఎలా నిల్వ చేయాలో మీకు తెలుసా? ఇది చాలా సులభం. కట్ చేసిన ముక్కలను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే మరో మూడు రోజుల వరకు వాడవచ్చు; దీని వల్ల రుచి లేదా టెక్స్చర్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

ఈ విధంగా మీరు క్యాప్సికమ్‌ను వివిధ పద్ధతుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ తాజాగా ఉన్న కూరగాయలనే వాడటం అలవాటు చేసుకోండి. పాడైపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. నిల్వ చేసే విధానం సరిగ్గా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. క్యాప్సికమ్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వీటిని మసాలాతో వండుకోవచ్చు లేదా ఇతర కూరగాయలలో కలిపి తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES