Published: Oct 29, 2026, 10:00 AM|Updated: Oct 29, 2026, 10:15 AM
Abhishek Sharma ICC T20 Ranking Record: తాజా ఐసీసీ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 897 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో మొదటి స్థానంలో ఉన్న భారత వికెట్ కీపర్ - బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం 866 పాయింట్లతో మూడో స్థానానికి చేరాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీతో అభిషేక్ విజృంభించగా.. ఈ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ 883 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ, టాప్‌లో ఉన్న అభిషేక్ శర్మ కంటే 14 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అంతకుముందు అభిషేక్ రెండో స్థానంలో ఇషాన్ మొదటి స్థానంలో ఉండేవారు.