అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి కాకినాడ సముద్రంలో ఒక కార్గో నౌక కొట్టుకుపోయింది. విశాఖ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన ఈ నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. కేజీ బేసిన్‌లోని రవ్వ ఆయిల్ క్షేత్రం వద్ద ఈ నౌక కొట్టుకుపోయిందని తెలిపారు. దీనిని మార్షల్ ఐలాండ్‌కు చెందిన సిగ్మా పేరల్ నౌకగా గుర్తించామని చెప్పారు. నౌక 130 నాటికల్ మైళ్లు కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. అంతకుముందు ఆ షిప్ విశాఖలో సరుకును అన్లోడ్ చేసిందని, తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు.