సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 28 నుంచి నవంబర్ 1కి SEC వాయిదా వేసింది. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించింది. అదే రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కూడా జరగాల్సి ఉంది. దీంతో MPTC, ZPTC ఎన్నికల తేదీ మార్పుపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఓట్ల లెక్కింపు, పరిషత్ ఎన్నికల పోలింగ్ ఒకేరోజు నిర్వహిస్తే పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని SEC భావిస్తోంది. పోలింగ్‌ను నవంబర్ 5కి మార్చడం సముచితమని పోలీసు ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. పోలింగ్ తేదీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.