ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతిని పురస్కరించుకుని పట్నాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో అక్రమాలకు పాల్పడిన వారందరినీ కాంగ్రెస్ జైలుకు పంపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెంటనే సభలో ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ.. తిరుగుబాటు లేనంత కాలం ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు అని గట్టిగా అరిచారు. అందుకు ఖర్గే.. మోదీ తండ్రి కూడా పోతారు అని గట్టిగా బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యపై బీజేపీతోపాటు ఎన్డీయే కూటమిలోని జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ ఆవామ్ మోర్చా వంటి పార్టీల