ఎన్నికల నిబంధనలు ముగిసిన వెంటనే మూసివేసిన డిపోలను పునరుద్ధరించడానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. చర్చల అనంతరం జేఏసీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రయాణికుల సౌకర్యార్థం మరో 4 వేల డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని వారు కోరారు. స్త్రీశక్తి పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా సదుపాయాలు కల్పించాలని, అలాగే రాబోయే పుష్కరాల కోసం బస్సుల కొనుగోలు అవసరమని వారు స్పష్టం చేశారు.