Published: Oct 24, 2026, 08:05 PM|Updated: Oct 24, 2026, 08:07 PM
Para Asian Games India Medal Tally: పారా ఆసియా క్రీడల్లో భారత పారా అథ్లెట్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ పతకాల వేట కొనసాగించారు. నిలకడైన ప్రతిభతో ఏకంగా 114 పతకాలను కైవసం చేసుకుని భారత్ పతకాల పట్టికలో దూసుకెళ్లింది. ప్రస్తుతం పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్..వీటిలో సగానికి పైగా అథ్లెటిక్స్ విభాగంలో రావడం విశేషం.