APలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మూడు పార్టీల నేతలు రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చించారు. మొదటగా టీడీపీకి 62 శాతం, జనసేనకు 30 శాతం స్థానాలు ఇవ్వాలని పవన్‌కల్యాణ్ ప్రతిపాదించారు. మొత్తం స్థానాల్లో బీజేపీకి 5 శాతం వరకు కేటాయించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. ఏజెన్సీలోని అల్లూరి జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని పవన్‌కల్యాణ్ కోరగా, చంద్రబాబు దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.