తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.